వాట్.. ఆ సూపర్ డూపర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీముఖి చేయాలా..? చెడదొబ్బింది ఎవరంటే..?

వాట్ .. శ్రీముఖి ఆ ఐటమ్ సాంగ్ మిస్ చేసుకుందా..? ప్రెసెంట్ ఈ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది . జనరల్ గా ఐటెం సాంగ్స్ చేయాలి అంటే స్టార్ హీరోయిన్స్ కి మాత్రమే అలాంటి ఆఫర్లు ఇస్తూ ఉంటారు డైరెక్టర్ లు. శ్రీముఖి టాప్ యాక్టర్ అని చెప్పలేం.. అలా అని తీసి పడేసే రేంజ్ కూడా కాదు . ఇండస్ట్రీలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . యాంకర్ గా తన కెరీర్ ను ప్రారంభించిన శ్రీముఖి .. ఆ తర్వాత తనదైన స్టైల్ లో వాళ్ళ సినిమాల్లో కూడా నటించింది.

ఎక్కడ మెయిన్ లీడ్ గా చేయలేదు ..హీరోలకి సిస్టర్ పాత్రలో మాత్రమే నటించింది . కొన్ని సినిమాల్లో బోల్డ్ పాత్రలో కనిపించిన అవి ఫ్లాప్ అయ్యాయి. దీంతో బుల్లితెరకే పరిమితమైంది యాంకర్ శ్రీముఖి . అయితే ఆమె ఖాతాలో ఒక బిగ్ ఐటమ్ సాంగ్ పడాల్సి ఉండిందట. కానీ అది వచ్చినట్లే వచ్చి చేయి జారిపోయిందట . ఈ విషయాన్ని స్వయాన శ్రీముఖి ఓ ఇంటర్వ్యూ లో బయట పెట్టడం గమనార్హం. రవితేజ కెరియర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన మూవీ క్రాక్ .

ఈ సినిమాలో “భూమ్ బదల్” అనే సాంగ్ లో శ్రీముఖిని నటింపజేయాలి అనుకున్నాడట గోపీచంద్ మలినేని. అయితే ఆమె గురించి ఎంక్వైరీ చేయగా .. ఆమె అంత హాట్ ఎక్స్పోజింగ్ చేయదు అంటూ చెప్పారట. దీంతో అడిగి నో అనిపించుకోవడం ఎందుకు అన్న కారణంతో గోపీచంద్ మలినేని తప్పుకున్నారట. ఆ తర్వాత ఈ పాత్ర వేరే వాళ్లకు వెళ్ళింది . ఈ సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయింది . అయితే ఒకానొక ఈవెంట్లో ఇదే పాటకు శ్రీముఖి అదిరిపోయే రేంజ్ లో స్టెప్స్ వేసింది . అది చూసి గోపీచంద్ షాక్ అయిపోయాడట . నిన్ను ఈ పాటలో డాన్స్ చేయిద్దాం అనుకున్నామని కానీ కొందరు నువ్వు అంత ఎక్స్పోజింగ్ చేయవు అని చెప్పడంతో నీ వరకు ఈ ఆఫర్ తీసుకురాలేకపోయాను అని చెప్పారట. ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది..!!