షారుక్ కంటే ఎక్కువ రెమ్యున‌రేషన్ ఇస్తానన్న.. ఆ ప్రాజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో.. ఎవరో తెలుసా..?!

టాలీవుడ్‌ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా ప్రస్తుతం ఎలక్షన్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 2024 ఎన్నికల బరిలో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పవన్.. ఈసారి ఎలాగైనా విజయాన్ని సాధించి పార్లమెంట్లో అడుగు పెట్టాలని అహర్నిశలు శ్రమిస్తున్నాడు. దీంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి మరి పూర్తిగా రాజకీయాలపై కాన్సెంట్రేట్ చేసిన పవన్ కళ్యాణ్.. లోకల్ మీడియా, జాతీయ మీడియాలకు పలు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ అయ్యాడు. తాజాగా పవన్ ఓ ఇంటర్వ్యూలో తన సంపాదన గురించి ఆసక్తికర విషయాలను బయట పెట్టాడు. మీరు వరుసగా ఎప్పుడు డబ్బులు డొనేట్ చేస్తూనే ఉంటారు. ఇటీవల పోలవరం నిర్వాసితుల కోసం కోటి రూపాయలు, సైనికుల కోసం కోటి రూపాయలు ఇచ్చారు.

Pawan Kalyan,Pawan Kalyan స్పెషల్ ఇంటర్వ్యూ.. జగన్ సర్కార్‌పై జనసేనాని  ఆసక్తికర వ్యాఖ్యలు - janasena party chief pawan kalyan shares interesting  issues in special interview - Samayam Telugu

అసలు డబ్బుపై మీ ఒపీనియన్ ఏంటి.. అని ప్రశ్నించగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. డబ్బుపై నాకు వ్యామోహం లేదని.. ఒక సందర్భంలో కోలా యాడ్ కోసం షారుక్ ఖాన్ కంటే ఎక్కువగా డ‌బ్బు ఇస్తాం.. నటించాలని నన్ను అడిగారంటూ వివరించాడు. కానీ అలా సంపాదించడం నాకు ఇష్టం లేదు. అందుకే దానిని రిజెక్ట్ చేశానంటే చెప్పుకొచ్చాడు. డబ్బు ఎలా సంపాదించాలో అనే విషయంలో నాకు కొన్ని నియమాలు ఉన్నాయని.. ప్రస్తుతం నేను సినిమాల్లో మంచి పొజిషన్లో ఉన్నా.. ప్రభాస్, తార‌క్‌, మహేష్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో పాటు నాకు కూడా తెలుగు ప్రేక్షకుల్లో మంచి మార్కెట్ ఉంది.

Where Pawan Kalyan plays a second act - The Hindu

అదే సంపాదన నాకు సరిపోతుంది. అలాగే నేను సంపాదించిన దానిలో కొంత కచ్చితంగా ప్రజలకు ఇవ్వాలనే నియమం కూడా ఉంది అంటూ వివరించారు. ఇక పవన్ కళ్యాణ్ గతంలో పలు కమర్షియల్ యాడ్స్ లో నటించినా.. తర్వాత తను ఉపయోగించని ప్రొడక్ట్స్ గురించి ప్రమోషన్స్ చేయడం సరైనది కాదనే ఉద్దేశంతో యాడ్ లలో నటించడం మానేశారట‌. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో ఓజి, హరిహర వీరమల్లు, ఉస్తాద్‌ భగత్ సింగ్ సినిమాలు ఉన్నాయి. కాగా 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సినిమాలకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చి ఎలక్షన్ కాన్వాయ్ లో పాల్గొంటూ సందడి చేస్తున్నాడు ప‌వ‌న్‌. ఎలక్షన్లు పూర్తయిన తర్వాత ఈ సినిమాలను పూర్తి చేస్తారని తెలుస్తుంది.