వార్ 2 కోసం బిగ్ రిస్క్.. కెరీయర్ లో ఫస్ట్ టైం అలా చేసిన తారక్.. శభాష్ హీరో..!

ప్రజెంట్ నందమూరి అభిమానులు దేవర సినిమా కాకుండా కోటి కళ్లతో వెయిట్ చేస్తున్న మరో మూవీ వార్ 2. బాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్ట్గా ఫస్ట్ టైం ఎన్టీఆర్ చేస్తున్న మూవీ ఇదే కావడం గమనార్హం. అంతేకాదు ఈ సినిమాలో విలన్ షేడ్స్ పాత్రలో కనిపించబోతున్నాడు తారక్. అంతేనా ఈ సినిమా కోసం ఏకంగా 100 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకున్నారట . బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రజెంట్ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది.

అయితే జనరల్ గా ఎన్టీఆర్ తన సినిమాలలో నటించే డాన్స్ కోసం ప్రాక్టీస్ చేయరు. ఇప్పటివరకు ఎన్టీఆర్ డాన్స్ ప్రాక్టీస్ చేసింది లేదు. కొరియోగ్రాఫర్ స్టెప్ చెప్పగానే డైరెక్ట్ గా టేక్ తీసేసుకుంటారు . అయితే ఫర్ ద ఫస్ట్ టైం కెరియర్ లో ఎన్టీఆర్ ఒక పాట కోసం డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు . దీంతో వార్ 2 కి సంబంధించిన న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. వార్ వన్ సినిమాలో హృతిక్ రోషన్ టైగర్ ష్రాఫ్ మధ్య వచ్చే సాంగ్ ఎంత హైలెట్గా మారిందో మనకు తెలుసు.

అయితే ఇప్పుడు అంతకుమించిపోయిన రేంజ్ లో ఘాటు స్టెప్స్ తో ఇష్టమైన స్టెప్స్ తో కొరియోగ్రఫీ చేయబోతున్నారట మేకర్స్ . అయితే ఈ పాట కోసం ఫస్ట్ టైం ఎన్టీఆర్ డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది . ఇది తెలుసుకున్న అభిమానులు షాక్ అయిపోతున్నారు. ఎన్టీఆర్ అంత స్పెషల్ గా ఫోకస్ చేస్తున్నారు అంటే.. ఈ సినిమా ఏ రేంజ్ లో జనాలను ఆకట్టుకుపోతుందో అర్థం చేసుకోవచ్చు అంటూ వార్తలను వైరల్ చేస్తున్నారు . చూద్దాం మరి వార్ 2 సినిమా ఎన్టీఆర్ కి ఎలాంటి పేరు తీసుకొస్తుందో..??