ఆయ‌న‌ గొప్ప‌ప‌నులు చేయ‌టానికి ఇష్ట‌ప‌డ‌తాడు.. ప్ర‌భాస్‌పై రానా ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్..?!

టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రభాస్, రానాల మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి, బాహుబలి 2 సినిమాల్లో కలిసి నటించిన ప్రభాస్, రానా అద్భుతమైన అభినయంతో ఆకట్టుకున్నారు. ఈ మూవీ షూట్ టైంలో వీరిద్ద‌రికి మంచి స్నేహం ఏర్ప‌డింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రానా మాట్లాడుతూ ప్రభాస్ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం రానా, ప్రభాస్ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ నెటింట‌ హార్ట్ టాపిక్ ఆ వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ ఎవరితోనూ ఎక్కువ సమయం మాట్లాడడ‌ని.. కేవలం ఐదు నిమిషాలు మాట్లాడి వెళ్లిపోతాడని ఆయన చెప్పుకొచ్చాడు. ప్రభాస్ గొప్ప ప‌నులు చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడని.. ఓ సింపుల్ పర్సన్ అంటూ వివ‌రించాడు.

హంబుల్ హ్యూమన్ బీయింగ్ అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. రానా చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తెగ సంతోషపడుతున్నారు. వీరిద్దరి కాంబోలో మరో సినిమా వస్తే బాగుంటుందని ఆరాటపడుతున్నారు. ఇక ఈ క్రమంలో రానా మాట్లాడుతూ రజనీకాంత్ సార్ తో కలిసి నటించాలని ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నానని.. వెటయాన్ సినిమాతో ఆ కల నెరవేరింది అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా కథ వినగానే చాలా నచ్చేసింది. అయితే ఈ సినిమా రజినీకాంత్ స్టైల్ సినిమా కాదంటూ వివరించాడు. అక్టోబర్‌లో ఈ సినిమా రిలీజ్ కానుందని రానా చెప్పుకొచ్చాడు. కల్కి 2898ఏడీ.. హాలీవుడ్ అవెంజర్స్ రేంజ్ లో ఉండబోతుందని రానా వివరించాడు.

ఇక కల్కిలో నేను నటించాను అంటూ ప్రచారం జరుగుతుంది. అందులో నిజం లేదంటూ వివరించాడు. ఇక రాజమౌళి సక్సెస్ సీక్రెట్ గురించి చెప్పమంటూ రానని ప్రశ్నించగా.. రానా మాట్లాడుతూ రాజమౌళితో ఆరేళ్లు కలిసి ట్రావెల్ చేశా.. ఆయన ఎప్పుడు మార్కెట్, రెమ్యున‌రేషన్ లాంటి విషయాలపై ఫోకస్ పెట్టారు. అద్భుతమైన సినిమాను ప్రేక్షకులకు అందించాలని శ్రమిస్తూ ఉంటారు. అదే ఆయన సక్సెస్ సీక్రెట్ అంటూ రానా వివరించాడు. ఇక రానా మంచి కంటెంట్ ఉన్న కథలనే ఎంచుకుంటూ అతి తక్కువ సినిమాల్లో నటిస్తూనే భారీ పాపులారిటీ దక్కించుకుంటున్నాడు. ఆయన నటించిన ప్రతి సినిమాతో మరింత క్రేజ్ ను పెంచుకుంటూ పోతున్నాడు.