అయ్యయ్యో..ఆ ఒక్క తప్పే రవితేజను స్టార్ డైరెక్టర్స్ పట్టించుకోకుండా చేసిందా..?

సినిమా ఇండస్ట్రీలో కొన్నిసార్లు పరిస్థితులు ఎలా మారిపోతూ ఉంటాయో ..? మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . అప్పటివరకు స్టార్ గానే ఉంటాడు . అయితే సడన్గా కొన్నిసార్లు ఆ స్టార్ స్టేటస్ డమాల్ అంటూ పడిపోతూ ఉంటుంది . దానికి కారణాలు ఏవైనా కావచ్చు . అయితే అలాంటి లిస్ట్ లోకి వస్తాడు మాస్ మహారాజా హీరో రవితేజ . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయనకు ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు .ఓకానొక టైంలో స్టార్ హీరోలకి కూడా టఫ్ కాంపిటీషన్ ఇచ్చిన హీరో .

అయితే ఇప్పుడు రవితేజ పరిస్థితి దారుణాతి దారుణంగా ఉంది . సినిమాలు అస్సలు వర్కౌట్ అవ్వడం లేదు . కొంతమంది డైరెక్టర్స్ నమ్మి అవకాశాలు ఇస్తున్న ఆ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. బడా డైరెక్టర్ లు ఆయన సినిమాలను పక్కన పెట్టేశారు. అసలు ఆయన ఇండస్ట్రీలో ఒక హీరో అని గుర్తించడమే మానేశారు . దానికి కారణం రవితేజ కెరియర్ లో తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలే అంటూ ప్రచారం జరుగుతుంది . రవితేజ చాలా చాలా మంచోడు.

ఎంత మంచోడు అంటే తన సినిమా రిలీజ్ అవుతుంది పక్క హీరో సినిమా రిలీజ్ అవుతుంది.. తన సినిమా కంటే పక్క హీరోకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాడు. పక్క హీరోని ప్రమోట్ చేస్తాడు . మరి ముఖ్యంగా ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చే హీరోస్ అంటే రవితేజకు మహామహా ఇష్టం . ఎంతోమంది హీరోస్ కి అలా రవితేజ హెల్ప్ చేశాడు . అలాంటి కారణంగానే రవితేజ తన కెరీర్ లో కొన్ని టఫ్ సిచ్యుయేషన్స్ ఎదుర్కొన్నాడు అని ..ఇప్పుడు అది మరింత దారుణమైన స్థాయికి పడిపోయాయి అని ..అందుకే రవితేజకు ఆఫర్స్ రావడం లేదు అంటూ ప్రచారం చేస్తున్నారు . ఆయనను దూరం పెట్టడానికి ఆయనలో ఉన్న అతి మంచితనమే కారణం అంటూ ప్రచారం చేస్తున్నారు..!!