పవన్ ని గెలిపించడానికి కోట్లల్లో డీల్ చేసుకున్న జబర్దస్త్ కమెడియన్స్.. గెటప్ శీను క్లారిటీ.. ?!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేత గా పార్టీని స్థాపించి గత కొన్నేళ్లుగా ఎన్నికల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కేవలం ఒకే ఒక సీటును మాత్రమే గెలిచి తీవ్ర పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. ఆయన గాజువాక, భీమవరం నుంచి పోటీ చేయగా రెండుచోట్ల ఓటమి చెవి చూడాల్సి వచ్చింది. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఏ మాత్రం నిరాశ చెందకుండా ఓటమిని అంగీకరించారు. తన సొంత డబ్బుతో సేవా కార్యక్రమాలను చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఆయన శ్రమిస్తున్నాడు.

టీడీపీ, బీజేపీ పార్టీలతో పొత్తు కుదురుచుకున్న జనసేనాని.. కాపు సామాజిక వర్గం ఓట్లు అత్యధికంగా ఉన్న పిఠాపురంలో పోటీ చేస్తున్నాడు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. కాగా పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా గెలిపించాలని ఉద్దేశంతో జబర్దస్త్ టీం మొత్తం దిగిపోయారు. హైపర్ ఆది ఎప్పటినుంచో షూటింగ్స్ కు గ్యాప్ ఇచ్చి.. ఒక నెలపాటు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారానికి సిద్ధమయ్యాడు. పిఠాపురంలో హైపర్ ఆది మాకం వేసి జనసేనకి గ్రేట్ సపోర్ట్ ఇచ్చాడు. అలాగే గెటప్ శీను, సుడిగాలి సుదీర్, రాంప్రసాద్, రాకెట్ రాఘవ లాంటి జబర్దస్త్ కమెడియన్స్ అంతా ప్రస్తుతం పిఠాపురంలో భారీ ఎత్తున ప్రచారాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

పిఠాపురంలో జబర్దస్త్ టీమ్‌ ప్రచారానికి 2 కోట్లు..బ్యాంక్ అకౌంట్లు చెక్  చేసుకోండి..వైసీపీకి గెటప్ శ్రీను సవాల్ | Jabardasth fame getup Srinu  sensational comments ...

అయితే జబర్దస్త్ కమెడియన్స్ పిఠాపురంలో ప్రచారం చేసేందుకు డబ్బులు తీసుకున్నారని ఈవెంట్‌కి పేమెంట్ తీసుకున్నట్లు ఎన్నికల ప్రచారానికి దాదాపు మనిషికి రెండు కోట్ల వరకు డబ్బులు తీసుకుంటున్నారు అంటూ జనసేన పార్టీ ప్రత్యర్ధుల నుంచి ఆరోపణలు వెలువడ్డాయి. ఈ ఆరోపణలపై తాజాగా గెటప్ శీను స్పందించాడు. ” రాజా యాదవ్ ” మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న గెటప్ శీను జనసేన ప్రచారం కోసం డబ్బులు తీసుకుంటున్నారు అంటూ వస్తున్న ప్రచారాల్లో నిజం లేదని.. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం, ఆయన మంచి నాయకుడిగా ఉంటారని నమ్మకంతో ఆయనకు ప్రచారం చేస్తున్నామని.. మీకు సందేహం ఏదైనా ఉంటే మా బ్యాంక్ అకౌంట్ వివరాలన్నీ ఇస్తాము.. చెక్ చేసుకోమంటూ చెప్పుకొచ్చాడు.

NARAYANKHED PAWAN KALYAN DHFS | @janasenaparty @pawankalyan Do Follow  @powerstar_addicts #Pawankalyan #janasena #janasenaparty #explorepage  #explore #janasenaveeramah... | Instagram

ఇక ఏళ్ల తరబడి జబర్దస్త్ జడ్జిగా వ్యవహరించిన రోజా కొద్దిరోజుల క్రితం.. టాలీవుడ్లో మెగా ఫ్యామిలీ ఆధిపత్యం ఎక్కువ. జబర్దస్త్ కమెడియన్స్‌వి చిన్న ప్రాణాలు. మెగా ఫ్యామిలీకి భయపడే వాళ్ళు ప్రచారం చేస్తున్నారంటూ ఆమె కామెంట్స్ చేసింది. దానిపై స్పందించిన గెటప్ శీను.. రోజా గారి కామెంట్స్ చాలా చిన్న కామెంట్స్ గా తీసుకుంటాను. నేను మెగా హీరోలతోనే కాదు.. ఎన్టీఆర్, వెంకటేష్, నాని ఇలాంటి స్టార్ హీరోలు ఎంద‌రితోనో నటించాను అంటూ ఆయన వివరించారు. ఆఫర్స్ కోసం, పవన్ కళ్యాణ్‌కు భ‌య‌ప‌డి ప్రచారానికి దిగలేదని పరోక్షంగా క్లారిటీ ఇచ్చేశాడు.