ఇక చచ్చాడు పో.. మళ్ళీ ఆ సినిమా వాయిదా పడ్డిందా..? దరిద్రం అంటే ఇదే..!

సినిమాలు వాయిదా పడడం అనేది చాలా చాలా కామన్. అయితే చిన్న సినిమాల విషయంలో అలా వాయిదాలు పడినప్పుడు పెద్దగా ప్రాబ్లం రాదు. ఫ్యాన్స్ కూడా పెద్దగా హర్ట్ అవ్వరు? అదే ఒక స్టార్ హీరో ..ఒక బడా హీరో.. పాన్ ఇండియా లెవెల్ లో ఎక్కిన మూవీస్ వాయిదా ..? పడితే మేకర్స్ కు నటులకు చాలా చాలా ఇబ్బందులు . ఆ బాధను వర్ణించలేము. ప్రెసెంట్ అలాంటి సిచువేషన్ ఫేస్ చేస్తున్నాడు కమల్ హాసన్ .

కమల్ హాసన్ తన కెరియర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా ఇండియన్ 2. ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి ఇష్టంగా తెరకెక్కించారు . అయితే ఈ సినిమా షూట్ ఎప్పుడో మొదలైంది. ఎప్పుడో కంప్లీట్ అయింది. కానీ రిలీజ్ విషయంలో మాత్రం పలు అడ్డంకులు ఎదుర్కొంటూ వస్తుంది. ఒకానొక టైంలో సినిమాలోని కొన్ని సీన్స్ మళ్లీ రీ షూట్ చేయాలి అనుకోవడంతో ముందు అనుకున్న డేటును వాయిదా వేయించారు .

ఆ తర్వాత పలు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతూ ఉండడంతో కమల్ హాసన్ వెనక్కి తప్పుకున్నాడు . అయితే ఫైనల్లీ జూన్ 13వ తేదీ ఎట్టకేలకు రిలీజ్ చేయడం పక్కా అంటూ ఫిక్స్ అయిపోయారు ఇండియన్ 2 మేకర్స్. అయితే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ఊహించిన షాక్ ఇచ్చాయి . నిజానికి మే 9 వ తేదీ కల్కి సినిమా రిలీజ్ అవ్వాలి . ఒకవేళ ఆ రోజా సినిమా రిలీజ్ అయి ఉంటే కమల్ హాసన్ సినిమాకు పెద్దగా ప్రాబ్లం వచ్చేది కాదు .

ఏపీ ఎన్నికల సందర్భంగా కల్కి సినిమా జూన్ 27 కు పోస్ట్ పోనైంది. దీంతో కమల్ హాసన్ కు పెద్ద తలనొప్పి వచ్చింది. కమల్ హాసన్ సినిమా ఖచ్చితంగా రికార్డ్స్ పరంగా లాస్ అయిపోతుంది అందుకే ప్రభాస్ దెబ్బకి వెనక్కి తప్పుకున్నాడు కమలహాసన్ అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇండియన్ 2 సినిమా జూలై 13 వ తేదీ రిలీజ్ చేయబోతున్నారట .ఆల్రెడీ కల్కి సినిమాలో కూడా కమల్ హాసన్ నటించాడు. తాను నటించిన తన సినిమా తనకే కాంపిటీషన్ రాకూడదు అని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారట..!!