నాని, నితిన్ ఇద్దరి ఫోకస్ ఆ ఏరియా పైనే.. అంత స్పెషల్ ఎందుకంటే..?!

ఇక మరో రెండు రోజుల్లో అంటే డిసెంబర్ 7న నాని హీరోగా నటించిన ” హాయ్ నాన్న ” సినిమా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అలాగే మరో మూడు రోజుల్లో అంటే డిసెంబర్ 8న నితిన్ హీరోగా నటించిన ” ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ” సినిమా రిలీజ్ కానుంది. ఇక వీరి సినిమాలను ఈ ఇద్దరి హీరోలు కూడా ఓ రేంజ్ లో ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇక ఈ ఇద్దరు హీరోలను కూడా ఓ విషయంలో మెచ్చుకోవచ్చు. యూ. ఎస్ ప్రమోషన్స్ విషయంలో నాని, నితిన్ తమ సినిమాలను ఓ రేంజ్ లో ప్రమోట్ చేయనున్నారు.

ఇక నాని సినిమాలు ఓవర్సీస్ లో ఏదో ఒక కారణంగా 1 మిలియన్ కలెక్షన్స్ పక్కా కొట్టేస్తాయి. ఇక ప్రజెంట్ హాయ్ నాన్న సినిమాని ఇంకొంచెం ప్రమోట్ చేస్తే.. కాస్త ఎక్కువ కలెక్షన్స్ను రాబడుతుంది అని నాని ఆశ. ఇక నితిన్ ” ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ” వంటి కామెడీ ట్రాక్ ఉన్న సినిమాని ఓవర్సీస్ లో ప్రమోట్ చేస్తే ఎక్కువ కలెక్షన్స్ రాబడుతుంది. ఇక ఇలాంటి సినిమాలకు ఆ ఏరియాలో బాగా డిమాండ్ ఉంటుంది. ఈ కారణం తోనే నితిన్ కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఇక ఈమధ్య తెలుగులో కంటే ఓవర్సీస్ లోనే మన సినిమాలకి ఎక్కువ స్క్రీన్స్ దొరుకుతున్నాయి. ఒకప్పుడు రివ్యూలపై ఆధారపడి అక్కడ ఓపెనింగ్స్ ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం వాటిని పట్టించుకోకుండా అక్కడి జనాలు కొత్త సినిమాని ఎక్కువగా చూస్తున్నారు. పైగా ఇప్పుడు అక్కడ టికెట్ రేట్లు కూడా ఒకప్పటి రేట్ల తో పోలిస్తే ఇప్పుడు బెటర్. ఇక ఇంత ఆలోచించి నితిన్, నాని యూ. ఎస్ లో తమ సినిమాలని గట్టిగానే ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇక ఈ విషయంలో వీరిద్దరిని కూడా అప్రిషియేట్ చేయవచ్చు.