ఎన్టీఆర్ లో ఆ క్వాలిటీ నాకు బాగా నచ్చుతుంది.. జాన్వి కపూర్..?!

అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన జాన్వి కపూర్… వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇక తన నటనతో, అందంతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక దీంతో హిందీలో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అందుకున్న ఈ బ్యూటీ… ప్రస్తుతం తెలుగులోకి కూడా ఎంట్రీ ఇస్తుంది. కొరటాల శివ దర్శకత్వంలో… యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” దేవర ” సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వనుంది జాన్వి.

ఇక తెలుగులో ఈ సినిమా కనుక హిట్ అయితే జాన్వికి తిరిగే ఉండదు. ఇక రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వి.. తారక్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌ చేసింది. ఈమె మాట్లాడుతూ…” నాకు దేవర సెట్స్ ని వదిలి వెళ్లాలని అనిపించదు. షూటింగ్ పూర్తి అవ్వగానే అప్పుడే వెళ్లిపోవాలా? ఇంకాసేపు ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇక.. ముందు నుంచి నేను జూనియర్ ఎన్టీఆర్ కి అభిమానిని.

ఆయనతో నాకు మంచి స్నేహం ఏర్పడింది. షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ తన తోటి నటులతో ఎంతో సరదాగా ఉంటారు. అతనిలోని ఈ గుణమే నాకు బాగా నచ్చుతుంది. కానీ రీసెంట్ గా నాతో పలు సన్నివేశాలను చిత్రీకరించారు. అప్పుడు సెట్ లో ఎన్టీఆర్ లేరు. నేను చాలా బాధపడ్డ. ఆరోజు మొత్తం డల్ గానే కూర్చుని, ప్యాకప్ చెప్పగానే నీరసంతో ముంబైకి తిరిగి వెళ్ళిపోయా ” అంటూ చెప్పుకొచ్చింది జాన్వి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.