‘ యానిమల్ ‘ ఓటీటీ ఎంట్రీ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ హీరోగా.. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన బోల్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” యానిమల్ “. ఇక ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే.

ఇక బాబీ డియోల్ విలన్ గా నటించిన ఈ మూవీ తెలుగు వర్షన్ బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. ఈ సినిమాకు ఎక్కువ శాతం పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమాలో రణబీర్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. .

ఇక ఈ సినిమా ఓటీటీ విషయానికి వస్తే.. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీని 2024 జనవరి సంక్రాంతి కానుకగా.. ఓటీటీ లో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.