లేటెస్ట్ అప్డేట్: ఎన్టీఆర్ ‘ దేవర ‘ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్.. డేట్ ఎప్పుడంటే..?!

జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకుల ఆదరణ పొందిన ఈయన.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఎన్టీఆర్ తాజాగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” దేవర “. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ ముద్దుగుమ్మ కి టాలీవుడ్ లో ఇదే మొదటి సినిమా. ఇక సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాకి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంస్థలు గ్రాండ్ లెవెల్ లో నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తుంది.

అదేంటంటే.. దేవర ఫస్ట్ లుక్ టీజర్ ని రానున్న క్రిస్మస్ పండగ కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అలాగే ఇందుకు సంబంధించి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ పాన్ ఇండియా మూవీని 2024 ఏప్రియల్ 5న గ్రాండ్ లెవెల్ లో ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నారు.