రవితేజ – ‘ యానిమల్ ‘ బ్యూటీ కాంబోలో మూవీ.. క్లారిటీ ఇదే..

ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ హీరోగా.. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ ” ఈగల్ “. ఇక ఈ మూవీ నుంచి నిన్ననే ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ కాగా.. మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక ఈ సినిమాపై రవితేజ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ సినిమా తరువాత రవితేజ లైన్ అప్ ఓ క్రేజీ బజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రీసెంట్గా రిలీజ్ అయిన ” యానిమల్ ” సినిమాలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించిన నటి త్రిప్తి, రవితేజ సరుసున నటిస్తుందంటూ ఓ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇక వీరి కాంబినేషన్ పై ఆరా తీస్తే తెలిసిందేంటంటే… అసలు వీరిద్దరి కాంబినేషన్లో ఏ సినిమా తెరకెక్కడం లేదట. ఇవన్నీ కేవలం కావాలని చేసిన రూమర్సే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీరిద్దరి కాంబోలో ఎటువంటి సినిమా రావడంలేదని పక్కా క్లారిటీ వచ్చేసింది.