‘ యానిమల్ ‘ మూవీ ఊచకోత.. నాలుగు రోజుల్లో ఎంత వచ్చిందంటే..?!

రణబీర్ కపూర్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్గా.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” యానిమల్ “. ఇక ఈ సినిమా రిలీజ్ కి ముందు ఓ రేంజ్ లో అంచనాలు నెలకొల్పినప్పటికీ… రిలీజ్ అనంతరం మిక్సిడ్ టాప్ ను సొంతం చేసుకుండి.

ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ కలెక్షన్స్ రాబడుతుంది. కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 425 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ గా అరుదైన రికార్డ్స్ సాధించింది. హిందీతో పాటు తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ లో యానిమల్ సినిమాకి ఊహించని రెస్పాన్స్ దక్కుతుంది.

ఇక ఈ సినిమాలో ఉన్న డైలాగులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా ఓటీటీ లో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక కేవలం నాలుగు రోజులకే ఈ సినిమా కలెక్షన్స్ ఈ రేంజ్ లో ఉంటే… వారం పూర్తయ్యేసరికి ఇంకే రేంజ్ లో ఉంటాయో చూడాలి. సందీప్ రెడ్డి వంగాకి ఇది పెద్ద విజయం అనే చెప్పాలి.