ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన సాయి పల్లవి.. ఏకంగా ఎన్ని సినిమాల్లో నటిస్తుందంటే..?!

సౌత్ స్టార్ బ్యూటీ సాయి పల్లవి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన ఫిదా సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు ప‌రిచ‌యం అయ్యింది. తెలంగాణ యాసలో తన కట్టుబొట్టుతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. దీంతోపాటు తెలుగులో మొదటి సినిమాకి అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరోయిన్‌గా క్రెడిట్ కొట్టేసింది. ఏడాదికి ఏకంగా ఐదారు సినిమాల్లో నటించే అంత ఇమేజ్ను దక్కించుకున్న ఈ బ్యూటీ.. 2023 లో ఒక్క సినిమాలో కూడా నటించకపోవడం గమనార్హం. చివరిగా గత ఏడాది విరాట పర్వం సినిమాతో రానా స‌ర‌సన నటించిన ఈ ముద్దుగుమ్మ ఏడాది కాలం పాటు ఎలాంటి సినిమాలకు ఓకే చెప్ప‌లేదు.

Sai Pallavi : 'నా తల్లిని లైంగికంగా వేధించారు' : సాయి పల్లవి

దీంతో ఈ బ్యూటీ సినిమా ఇండస్ట్రీకి దూరమైందంటూ, సినిమాల్లో నటించడం మానేస్తుందంటూ పలు వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో ఫ్యాన్స్ అంత డిసప్పాయింట్ అయ్యారు. ఈ వార్తలకు తగ్గట్టే సాయి పల్లవి కూడా ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలకు నో చెబుతూ వచ్చింది. ఇక ప్రస్తుతం ఒకటి కాదు రెండు కాదు నాలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ ట్రెడిష‌న‌ల్ బ్యూటీ. అందులో కొన్ని సినిమాలకు షూటింగ్స్ కూడా ప్రారంభమయాయి. తమిళ్లో ఓ సినిమాలను నటిస్తున్న సాయి పల్లవి.. ప్రస్తుతం తెలుగులో నాగచైతన్యకు జోడిగా తాండేల్ సినిమాలో కూడా నటిస్తోంది.

Pin on sai pallavi

ఇక మలయాళం లో నివిన్ ఫౌలితో ఓ సినిమాను చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొదట మలయాళం ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాలో నవీన్ పౌలితో కలిసి నటించింది. తర్వాత ఇంత కాలానికి మళ్లీ అతనితో కలిసి జతకట్టబోతుంది. ఇక దీంతోపాటే అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఎష్‌19 సినిమాలో కూడా సాయి పల్లవి హీరోయిన్గా నటించబోతుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. మొత్తానికి సాయి పల్లవి వరుస సినిమాలో నటిస్తూ ఫ్యాన్స్ కు ఆనందాన్ని కల్పించింది. సాయి పల్లవి అభిమానులు ఏదైతే కోరుకుంటున్నారో అదే జరగడంతో ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి అవుతున్నారు.