విజయ్ సినిమాను రిజెక్ట్ చేసిన ఆ స్టార్ బ్యూటీ హీరోయిన్.. కారణం ఏంటో తెలుసా..?

బాల దర్శకత్వం వహించిన నాచ్చియార్ సినిమాతో జీవి ప్రకాష్ కుమార్ లవర్ గా నటించి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది హీరోయిన్ ఇవానా. తర్వాత ప్రదీప్ రంగనాథన్‌కు జంటగా లవ్ టు డే సినిమాలో నటించింది. ఈ సినిమా భారీ బ్లాక్ బాస్ట‌ర్ హిట్‌ అందుకుంది. దీంతో ఇవానా యూత్ ఫేవరెట్ హీరోయిన్గా క్రేజ్ సంపాదించుకుంది. తర్వాత ఈ బ్యూటీ కి వరుస సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. అలా హరీష్ కళ్యాణ్ కు జంటగా ఎల్జిఎం సినిమాలో నటించింది. ఎం.ఎస్. ధోని ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా ఊహించిన రేంజ్ లో సక్సెస్ సాధించలేదు.

Ivana, tamil actress, cute HD phone wallpaper | Pxfuel

 

కానీ అదే టైంలో ఇవాన రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిందంటూ న్యూస్ వైరల్ అయ్యింది. దీంతో ఆమెకు వ‌చ్చిన‌ అవకాశాలు కూడాత‌గ్గిపోయాయంటు వార్తలు వినిపించాయి. ఇలాంటి నేపథ్యంలో ఇవానాకు కోలీవుడ్ హీరో విజయ్‌తో కలిసి నటించే బంపర్ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. విజయ్‌ ప్రస్తుతం తన 68వ సినిమాలో బిజీగా ఉన్నాడు. వెంకట ప్రభు దర్శకత్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా మీనాక్షి చౌదరి నటిస్తోంది. స్నేహ, ప్రశాంత్, ప్రభుదేవా, యోగి బాబు, ప్రేమ్‌జీ తదితరులు కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నట్లు టాక్. ఇక ఈ సినిమాలో ఇవానాకు నటించే అవకాశం వచ్చిందట.

Thalapathy 68: Meenakshi Chaudhary's first reaction on bagging Vijay starrer

కానీ ఈమె ఆ సినిమాకు రిజెక్ట్ చేసిందంటూ టాక్ వినిపిస్తుంది. దీనికి కారణం ఈ సినిమాలో విజయ్‌కు చెల్లెలుగా ఇవానా నటించే అవకాశం రావడమే నట. చెల్లెలు పాత్రలో నటిస్తే ఆ తర్వాత అన్ని అలాంటి పాత్రలే వస్తాయనే భయంతో ఇవానా ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందంటూ తెలుస్తోంది. ఏదేమైనా విజయ్ లాంటి స్టార్ హీరోతో నటించే అవకాశాన్ని ఈ బ్యూటీ మిస్ చేసుకోవడంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అనవసరంగా స్టార్ హీరోతో నటించే అవకాశాన్ని మిస్ చేసుకున్నావ్ అంటూ.. ఇలాంటి అవ‌కాశం ప్ర‌తిసారి రాదు క‌దా అంటూ.. నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.