“పుష్ప సినిమా మొత్తం కాపీ నే.. నా నుండి దొబ్బేశారు”.. డైరెక్టర్ సంచలన పోస్ట్..!

ఇప్పుడు ప్రతి ఒక్కరు కళ్ళు పుష్ప 2 సినిమా పైనే పడింది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఓ పక్క ఇండస్ట్రీలో హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉంటే ..మరో పక్క కొంతమంది మాత్రం దారుణాతి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. దానికి రీజన్ ఏంటో అర్థం కావడం లేదు. ఆఫ్కోర్స్ ఎక్కడ పొగిడే వాళ్ళు ఉంటారో.. అక్కడ తిట్టేవాళ్ళు ఉన్నట్లు ..ఎక్కడ సినిమాని పబ్లిసిటీ చేసే వాళ్ళు ఉంటారో.. అక్కడ ఆ సినిమాను తొక్కేసే వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పడానికి ఇదే నిదర్శనం . సోషల్ మీడియాలో పుష్ప సినిమాకు సంబంధించిన ఒక న్యూస్ బాగా వైరల్ గా మారింది .

పుష్ప సినిమాలో అల్లు అర్జున్ స్టైల్ నా నుంచి కాపీ కొట్టాడు అంటూ కన్నడ స్టార్ట్ బన్నీని క్రిటిసైజ్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టాడు . సోషల్ మీడియాలో ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఓ కన్నడ మీడియా ఇంస్టాగ్రామ్ పేజ్ లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. అదే పోస్టు తన స్టోరీలో పెట్టుకున్నాడు కన్నడ డైరెక్టర్ ప్రేమ్ . దీంతో ఈ న్యూస్ మరింత హట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

జోగి సినిమాలో పునీత్ రాజ్ కుమార్ స్టైల్ షర్ట్ పై చేతిముద్రను.. పుష్ప లో అల్లు అర్జున్ షర్ట్ వెనక ఉన్న చేతి ముద్రను కంపేర్ చేస్తూ పోస్ట్ పెట్టారు. అయితే ఈ విషయాన్ని నెట్టింట కన్నడ ఆడియన్స్ సైతం తప్పుపట్టారు. ప్రేమ్ మాత్రం గర్వంగా పోస్ట్ పెట్టడం పై మండిపడుతున్నారు జనాలు . అసలు సుకుమార్ క్యారెక్టరైజేషన్ ..డీటెయిల్ ఎలా ఉంటాయి.. ఒకసారి ఆయన సినిమాలు చూసి తెలుసుకో ఇలాంటి పోస్ట్ పెట్టడం సిగ్గుచేటు అంటూ తిట్టిపోస్తున్నారు . ప్రెసెంట్ ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది . దీంతో సోషల్ మీడియాలో పుష్ప2 పేరు మరోసారి హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది..!!