ఢిల్లీలో దోస్తీ… గల్లీలో కుస్తీ… ఇదే ట్రెండ్‌…!

నిన్నటి వరకూ ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అన్న చందంగా ఉన్న బీజేపీ, వైసీపీ మధ్య సంబంధాలు.. ఇటీవల నువ్వా, నేనా అన్న రీతిలో మారాయి. వైసిపి నేతలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడాన్ని రాష్ట్ర బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, మద్యం, ఇసుక వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించిన బీజేపీ.., విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తికి ఏకంగా లేఖ రాసింది. ఇదిలా […]

సుప్రీం తీర్పుపై టీడీపీ నేతల్లో ఉత్కంఠ..!

చంద్రబాబు కేసులో సుప్రీం కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అవినీతి నిరోధక చట్టంలోని 17 ఏ చంద్రబాబుకు వర్తిస్తుందా లేదా అనే అంశం పై సుప్రీంకోర్టు వెలువరించే నిర్ణయం కోసం ఆంధ్రప్రదేశ్ లో అన్ని రాజకీయపక్షాలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాయి. చంద్రబాబు పై నమోదు చేసిన కేసులు చెల్లవని, 17 ఏ ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోలేదని చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పి దాఖలు చేశారు. దీని పై సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. […]

రెండున్నర గంటల భేటీ… ఏం మాట్లాడుకున్నారో…?

జైలు నుంచి మధ్యంతర బెయిల్ పై విడుదలైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ మధ్య దాదాపుగా రెండున్నర గంటలపాటు భేటీ జరిగింది. అనారోగ్య కారణాలతో బెయిల్ పై విడుదలైన చంద్రబాబును పరామర్శించేందుకు పవన్‌ కళ్యాణ్‌, జనసేన పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి వచ్చారు. ప్రధానంగా ఆంధ్రాలో భవిష్యత్తు రాజకీయం, ఉమ్మడి మ్యానిఫెస్టో, క్షేత్రస్థాయి పోరాటాలు వంటి అంశాల పై ఇరుపక్షాలు […]

దళపతి విజయ్‌ రాజకీయ ఎంట్రీపై హింట్..!

దళపతి విజయ్‌కు కోలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి అస్సలు వివరించనక్కర్లేదు. విజయ్ సినిమా వచ్చిదంటే.. ప్రచారం బాధ్యతను వారే తీసుకుంటారు.. మూవీ మేకర్స్ కంటే ఎక్కువ పబ్లిసిటీ చేస్తుంటారు. అందుకే ప్లాప్‌ సినిమాలైనా అయినా సరే మినిమమ్ వసూళ్లతో బయటపడుతుంటాయి. అంతటి ఆదరణ ఉంది విజయ్ కు అభిమానుల్లో. విజయ్ కు కూడా ఫ్యాన్స్ అంటే చాలా ఇష్టం. తన సక్సెస్ సంతోషాన్ని ప్రతిసారి అభిమానులతో పంచుకుంటాడు. అయితే […]

మునుగోడులో రసవత్తరంగా త్రిముఖ పోటీ

నల్లగొండ జిల్లా మునుగోడు నియోజవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. త్రిముఖ పోటీ జరుగుతోంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో 2022లో ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన రాజగోపాల్‌రెడ్డి ఇటీవల కాంగ్రెస్‌లో చేరి.. టికెట్‌ తెచ్చుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించి భంగపడిన చల్లమల కృష్ణారెడ్డి.. బీజేపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. అధికార బీఆర్‌ఎస్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే కూసుకుంట్ల […]

వరుస కేసులతో చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి

తెలుగుదేశం అధినేత చంద్రబాబు పై రాష్ట్ర ప్రభుత్వం వరుస కేసులు నమోదు చేస్తోంది. రెండురోజుల క్రితం మద్యం పాలసీలో అక్రమాలు జరిగాయని కేసు నమోదు చేయగా, తాజాగా ఇసుక పాలసీలో అక్రమాలు జరిగాయని మరో కేసు నమోదు చేశారు. ఇలా వరుస కేసులతో చంద్రబాబుపై అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేస్తూ ఆయనను జైలు నుంచి బయటకు రాకుండా చేయాలని ప్రభుత్వం వ్యూహం రూపొందించింది. టీడీపీ అధినేత చంద్రబాబు ను అధికార […]

దేవర దండుతో బొమ్మ దద్దరిల్లిపోవాల్సిందే..

పాన్ ఇండియా మహిమో.. లేక పాతచింతకాయ పచ్చళ్లకు చెక్ పెట్టాలన్న సంకల్పమో కానీ.. కొత్త సంచలనాలకు తెరతీస్తోంది దేవర. బాక్సాఫీస్ షేక్ చేయాలంటే.. బౌండరీస్ దాటడం తప్పదని ఫిక్స్ అవుతున్నాడు. సినిమాను నెక్ట్స్ లెవల్ అనేలా తీర్చిదిద్దుతూ సెన్సేషన్‌కు కేరాఫ్‌గా మారుతున్నాడు. అందుకోసం ఓ రేంజ్ లో దండును దింపుతున్నారన్న మ్యాటర్ ఇంట్రెస్టింగ్ గా మారింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీ దేవర టాలీవుడ్ సెన్సేషన్‌గా మారుతోంది. ఆచార్య తర్వాత డైరెక్టర్ కొరటాల శివ […]

హ్యాట్రిక్ హిట్లతో బాలకృష్ణ జోరు

సక్సెస్ కోసం బాలయ్య భలే ప్లాన్ వేస్తున్నాడు. ఏ మాత్రం రిస్క్ తీసుకోకుండా ఓ సూపర్ షార్ట్ కట్ పట్టాడు. మరో రెండు, మూడేళ్ల దాకా ఏ టెన్షన్ లేని స్ట్రాటజీని ఫాలో అవుతున్నాడు. ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలిస్తే ఔర అనేస్తున్నారు. నందమూరి నటసింహం బాలకృష్ణ టైం నడుస్తోంది. సీనియ‌ర్ హీరోల్లో బాల‌య్య ఫుల్ స్వింగ్ లో క‌నిపిస్తున్నాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టేసిన బాలయ్య అన్ స్టాపబుల్‌గా దూసుకుపోతున్నాడు. రీసెంట్‌గా అడవి బిడ్డ […]

వరుస రైల్వే ప్రమాదాలకు కారణాలేమిటీ…?

ఘోర ప్రమాదాలు జరుగుతున్నా రైల్వేశాఖ గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. ఇలాంటి దుర్ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టినట్లు కనిపించడంలేదు. దీంతో అమాయక ప్రయాణీకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంతో మరోసారి రైల్వే అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. రెండు రైళ్లు ఢీకొనడంతో కంటకాపల్లి రైల్వేస్టేషన్ రక్తసిక్తమైంది. బాధితుల ఆహాకారాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. అలమండ స్టేషన్ కి కూతవేటు దూరంలో రైలు ఆగింది. అంతలోనే ఒక్కసారిగా గుండె పేలిపోయినంత పనైంది. హాహాకారాలు, అరుపులు, […]