‘అ అంటే అమలాపురం’ సాంగ్ హీరోయిన్ ఇలా మారిపోయింది ఏంటి ?అస్సలు గుర్తు పట్టలేరు..!

ఒకప్పుడు .. ఇండస్ట్రీని ఏలేసిన అందాలు ముద్దుగుమ్మలు అందరు ఇప్పుడు ఫేడ్ అవుట్ అయిపోతున్నారు. ఫెడ్ అవుట్ అయిపోయిన ముద్దుగుమ్మల గురించి తెలుసుకోవడానికి జనాలు ఇంట్రెస్టింగ్ గా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . అయితే ఆర్య సినిమా 20 ఏళ్లు కంప్లీట్ చేసుకున్న పుణ్యమా అంటూ ఒక హాట్ బ్యూటీ కి సంబంధించిన డీటెయిల్స్ మళ్లీ నెట్టింట వైరల్ గా మారాయి . ఆమె మరి ఎవరో కాదు ..”ఆ అంటే అమలాపురం అంటూ తన అంద చందాలతో ఓ ఊపు ఊపేసిన అందాల ముద్దుగుమ్మ అభినయశ్రీ”.

ఇప్పుడు జనాలకి ఈమె పేరు అర్థం కాకపోవచ్చు ..తెలియకపోవచ్చు కానీ ఒకప్పటి జనాలకు మాత్రం ఈ పేరు చెప్తే ముందుగా గుర్తొచ్చేది ఆ అంటే అమలాపురం. అప్పట్లో అ అంటే అమ్మ.. ఆ అంటే ఆవు అనడం మర్చిపోయేలా చేసింది ఈ ముద్దుగుమ్మ . అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్య సినిమాలో ఐటమ్ సాంగ్ పాత్రలో కనిపించిన మెప్పించింది అభినయశ్రీ. అప్పట్లో ఈ పాట ఏ రేంజ్ లో ఊపేసిందో ప్రత్యేకంగా చెప్పాలా..? ఏ స్కూల్ డాన్స్ పెర్ఫార్మెన్స్ అన్నా సరే కచ్చితంగా ఈ పాట ఉండాల్సిందే .

తనదైన స్టైల్ లో మాస్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసింది అభినయశ్రీ . రీసెంట్గా ఆర్య సినిమా 20 ఏళ్లు కంప్లీట్ చేసుకున్న శుభ సందర్భంగా గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు. ఆ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది అభినయశ్రీ . అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది. స్టేజిపై మరోసారి 20 ఏళ్ల తర్వాత ఆ అంటే అమలాపురం సాంగ్ కి డాన్స్ చేసి మెప్పించింది. దీంతో అభిమానులు ఓ రేంజ్ లో ఆమెను పొగిడేస్తున్నారు. దీంతో ఆమెకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . ఇప్పుడు మళ్లీ ఆమె ఐటెం సాంగ్ లో నటిస్తే బాగుంటుంది అంటూ ఆశపడుతున్నారు అభిమానులు..!!