సుకుమార్ దగ్గర బన్నీ అలాంటి ప్రామిస్ చేయించుకున్నాడా..? అందరి ముందు బయటపడ్డ నిజం..!!

సినిమా ఇండస్ట్రీలో కొందరు హీరోలు డైరెక్టర్లు ఎంత జాన్ జిగిడి దోస్తులుగా ఉంటారు అంటే ఫ్రెండ్స్ అనలేము.. రిలేషన్షిప్ కూడా కాదు ..అంతకుమించిన స్థాయిలో లైఫ్ లో తెలియని సరికొత్త రిలేషన్షిప్ కి అర్థం కాని బాండింగ్ నొ ఏర్పరచుకుంటారు. ఆ లిస్టులో నెంబర్ వన్ స్థానంలో ఉంటారు సుకుమార్ – అల్లు అర్జున్ . అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు అన్న ..సుకుమార్ పాన్ ఇండియా డైరెక్టర్గా మారారు అన్న ఇద్దరి కాంబోలో వచ్చిన సినిమాలే కారణమని ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు . వీళ్ళ కాంబోలో వచ్చిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది .

అంతేనా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది . చరిత్ర తిరగరాసింది . ఒకటా..? రెండా..? వీళ్ల కాంబోలో వచ్చిన సినిమాలు గురించి చెప్పుకుంటూ పోతూ ఉంటే అసలు టైమే సరిపోదు . ఓ పెద్ద చరిత్ర ఉంది . కాగా వీళ్ళ కాంబోలో త్వరలో రాబోతున్న సినిమా పుష్ప2. ఈ సినిమాతో గ్లోబల్ రికార్డులను బద్దలు కొట్టడానికి కన్నేశారు సుకుమార్ – బన్ని. కాగా రీసెంట్గా వీళ్ళ కాంబోలో వచ్చిన ఆర్య సినిమా 20 ఏళ్లు కంప్లీట్ చేసుకుంది. ఈ క్రమంలోని ఓ స్పెషల్ ఈవెంట్స్ ని కూడా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు . ఈ ఈవెంట్ కి ఆర్య సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరు హాజరై సందడి చేశారు .

ఈవెంట్లో సుకుమార్ మాట్లాడుతూ ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్నీ బయట పెట్టారు . “ఆర్య సినిమా షూటింగ్ టైంలో ఆర్య హిట్ అయితే బన్నీ నాతో ఏడు సినిమాలు చేయాలి అని మాట తీసుకున్నాడు. ఈ విషయాన్ని ఇప్పుడు బయటపడుతున్నాను “అంటూ అందరి ముందు అసలు నిజాన్ని బయటపెట్టేసాడు . అంటే ఈ విధంగా చూసుకుంటే ఇంకా బన్నీ సుకుమార్ కాంబోలో మూడు సినిమాలు రాబోతున్నాయన్నమాట అంటూ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో సంబరాలు చేసుకుంటున్నారు. ఆ మూడు సినిమాలకు కూడా ఓ రేంజ్ లో ఆకట్టుకునే విధంగానే ఉండబోతాయి అంటూ అప్పుడే ధీమా వ్యక్తం చేసేస్తున్నారు . త్వరలోనే రాబోతున్న పుష్ప2 పై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకున్నారు అభిమానులు..!!