ఈ క్యూట్ బేబీ ఇప్పుడు టాలీవుడ్ గ్లామరస్ ఆటం బాంబ్.. ఎవరో గుర్తుపట్టారా..?!

పై ఫోటోలో స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్న ఈ చిన్నదాన్ని గుర్తుపట్టారా.. టాలీవుడ్ ప్రేక్షకులకు ఎంతో దగ్గరైనా ఈ అమ్మడు మొదట సినిమాతోనే సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. అయితే ఇండస్ట్రీలో నెగ్గాలంటే టాలెంట్ తో పాటు ఒక్కింత అదృష్టం కూడా ఉండాలి. ఆమెకు ఆ అదృష్టం లేదని చెప్పాలి. మొదట్లో ట్రెడిషనల్ రోల్స్ ఎక్కువగా సెలక్ట్ చేసుకోవడంతో ఆమె కెరీర్ బెడిసి కొట్టినట్టు అయింది. దీంతో గ్లామర్ పాత్రలు పోషించేందుకు సిద్ధమైంది ఈ ముద్దుగుమ్మ. కానీ ఈ బ్యూటీకి అలాంటి సినిమాలు కలిసి రాలేదు. హీరోయిన్ గానే కాదు నిర్మాతగాను మారి నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా ఆశించిన ఫలితం దక్కలేదు.

Youtube maa tv serials chinnari pellikuthuru | rebeccaetnerowe1985's Ownd

ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా..? నిజానికి నార్త్ బ్యూటీ అయిన.. ఈ చిన్నది తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ అభిమానులను సంపాదించుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తర్వాత వెండితెర పైన సందడి చేసింది. ఆమె మరెవరు కాదు చిన్నారి పెళ్ళికూతురు అవికాగోర్. ఈ పేరు కంటే ఎక్కువ ఆనందిగానే బుల్లితెర ప్రేక్షకులు గుర్తు పడుతుంటారు. కొన్నేళ్ళ‌ క్రితం ఈ సీరియల్ బుల్లితెరపై రికార్డులు సృష్టించింది. ఇందులో చిన్నారి ఆనంది పాత్రలో అమాయకంగా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది అవికా. ఇటూ సౌత్, అటూ నార్త్ లోను భారీ పాపులారిటీ దక్కించుకుంది. ఇక తర్వాత కొన్నేళ్లకే తెలుగులో రాజ్ తరుణ్ జంటగా ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

Avika Gor: बेहद मुश्किल भरी थी अविका गौर की वेट लॉस जर्नी, जानें एक्ट्रेस ने कैसे घटाया 20 किलो वजन - 1920 Horrors of the Heart actress avika gor loses 20 kg

ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎలాంటి గ్లామర్ షో లేకుండా అచ్చ తెలుగు ఆడపిల్లల కనిపించిన అవికా.. ఆ తర్వాత మరోసారి రాజ్ తరుణ్ సరసన నటించింది. సినిమా చూపిస్త మామ, ఎక్కడికి పోతావు చిన్నవాడా, రాజు గారి గది 3 లాంటి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ ఆమెకు ఊహించిన స్థాయిలో ఛాన్సులు రాలేదు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వెళ్ళిన ఈ చిన్నది అక్కడ అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ అక్కడ కూడా ఆమెకు కలిసి రాకపోవడంతో నిర్మాతగా మారి తెలుగులో పాప్ కార్న్ పేరుతో సొంత బ్యానర్ పై సినిమాను తెరకెక్కించింది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలవడంతో. ఓటీటీలో అడుగు పెట్టి గతంలో వధువు వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంది.