దిల్ రాజు చెయ్యి పట్టుకుని మరి లాగి పెట్టి కొట్టిన ఏకైక తెలుగు డైరెక్టర్ ఇతనే.. ఎందుకంటే..?

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఆర్య సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . దానికి కారణం ఏంటి అనేది కూడా మనకి తెలుసు . సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన సినిమా ఆర్య. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . రీసెంట్గా ఈ సినిమా రిలీజ్ 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోని చిత్ర బృందం గ్రాండ్గా ఈవెంట్ నిర్వహించింది . ఈవెంట్ కి ఆర్య సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరు కూడా హాజరై సందడి చేశారు.

సినిమా టైంలో వాళ్ళు గడిపిన సరదా మూమెంట్స్ ను గుర్తు చేసుకున్నారు. ఇదే క్రమంలో సుకుమార్ మాట్లాడుతూ దిల్ రాజు ఎలా షూటింగ్ టైంలో తనను టార్చర్ చేశారు అన్న విషయాన్ని ఓపెన్ గా చెప్పేసాడు. స్టేజి పైకి వచ్చిన దిల్ రాజు నీ ఉద్దేశిస్తూ సుకుమార్ మాట్లాడుతూ ..”అప్పట్లో అన్ని సినిమాలు ఎక్కువగా రీల్ తో షూట్ చేసేవాళ్లు ..రీల్ ఎక్కువైతే ఖర్చు పెరిగిపోయేది ..రాజుగారు అప్పటికి ఒక్క సినిమానే తీసింది “..

“అందుకే అన్నిచోట్ల కాస్ట్ కటింగ్ ఎక్కువగా చూసేవాళ్ళు . నిర్మాతగా బడ్జెట్ని కంట్రోల్లో పెట్టడానికి నిరంతరం ట్రై చేసేవాళ్లు.. దీంతో వంద రీల్స్ అయిపోయిన ప్రతిసారి కూడా వచ్చి నన్ను చెయ్యి పట్టుకొని వెనక్కి తిప్పి వీపు మీద దబా దబా కొట్టేవాళ్ళు.. అలా చాలాసార్లు చెయ్యి వెనక్కి తిప్పి నన్ను కొట్టారు ..దాని వల్ల నాకు చేయి నొప్పి కూడా వచ్చింది.. నేను పుషప్స్ ఇప్పటికీ చేయలేను దానికి కారణం దిల్ రాజునే” అంటూ సరదాగా అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకొని మాట్లాడారు . సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది..!