చిరు రిజెక్ట్ చేసిన సినిమాతో బాలయ్య బ్లాక్ బస్టర్.. ఇంతకీ మూవీ ఏంటంటే..?!

ప్రస్తుతం ఉన్న హీరోలలో టాలీవుడ్ నెంబర్ వన్ హీరో అనగానే టక్కనే గుర్తుకొచ్చేది మెగాస్టార్ చిరంజీవి. దాదాపు 5 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న చిరంజీవి.. తనకంటూ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఇమేజ్ను ఏర్పరచుకున్నాడు. ఒకప్పుడు వరుస సినిమాలో నటిస్తూ ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. అలాగే చిరంజీవికి గట్టి పోటీ ఇచ్చే మరో స్టార్ హీరో అనగానే గుర్తుకు వచ్చే నేరు బాలకృష్ణ.. ఏజ్‌తో సంబంధం లేకుండా వీరిద్దరూ యంగ్ హీరోలకు పోటీగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా చిరంజీవి రిజెక్ట్ చేసిన ఓ సూపర్ హిట్ సినిమాలో బాలయ్య నటించి బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

Mangammagari Manavadu Full Movie | Nandamuri Balakrishna | Bhanumathi |  Suhasini | Rajshri Telugu

ఇంతకీ ఆ మూవీ ఏంటో.. ఒకసారి చూద్దాం. కోడి రామకృష్ణ డైరెక్షన్‌లో బాలకృష్ణ హీరోగా వచ్చిన మంగమ్మగారి మనవడు సినిమాలో.. మొదట చిరంజీవిని తీసుకోవాలని భావించారట. కానీ చిరంజీవి సినిమాను రిజెక్ట్ చేయడంతో బాలయ్య ఈ సినిమాల్లో నటించినట్టు తెలుస్తుంది. ఇక 1984లో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలవడమే కాదు.. ఇండస్ట్రీలో బాలయ్యకు ఒక బ్రాండ్ క్రియేట్ చేసింది. ఈ న్యూస్ ప్రస్తుతం నెటింట వైరల్ గా మారడంతో చిరంజీవి సినిమాలో నటించి ఉంటే ఆయన క్రేజ్ మరింతగా పెరిగేదని.. అనవసరంగా బంగారం లాంటి ఛాన్స్ ను రిజెక్ట్ చేశాడు అంటూ అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

చిరంజీవి Vs బాలకృష్ణ: బిగ్ ఫైట్ | telugu star heros chiranjeevi and  balakrishna Going to compete for Sankranti - Telugu Oneindia

ఇక చిరంజీవి కూడా ఇదే విషయాన్ని చాలామంది దగ్గర ప్రస్తావిస్తూ ఉంటాడని టాక్. మొత్తానికి చిరంజీవి సూపర్ హిట్ సినిమాను మిస్ చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం చిరంజీవి, వశిష్ట డైరెక్షన్లో విశ్వంభ‌ర సినిమాను నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఎలాంటి రిమార్క్ లేకుండా ఈ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బ‌స్టర్ కొట్టాలనే కసితో ఉన్నాడు చిరంజీవి. అలాగే మరో పక్క బాలయ్య కూడా వరుస సినిమా ఆఫర్లను అందుకుంటూ బిజీగా గడుపుతున్నాడు. ఇటీవల హ్యాట్రిక్‌ హీట్లతో దూసుకుపోతున్న బాలయ్య.. బాబి డైరెక్షన్లో తన 109వ సినిమాలో నటిస్తున్నాడు.