“ఆ ఒక్క ప్రశ్నతో రాజమౌళి ముఖం మాడిపోయిందిగా”.. అడిగి కడిగి పారేసిన రిపోర్టర్స్..!!

రాజమౌళి .. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరమే లేదు . దర్శక ధీరుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ డైరెక్టర్ .. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ ..దీని గురించి చెప్పుకుంటూ పోతుంటే మనకు టైం సరిపోదు . అలాంటి ఓ పెద్ద చరిత్ర ఉంది . తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ దేశాలకు పాకేలా చేసిన రాజమౌళి ను మీడియా వాళ్ళు తాజాగాడిగిన ప్రశ్నలు వైరల్ అవుతున్నాయి . బాహుబలి సినిమాకు 3ను ప్రకటించిన విషయం తెలిసిందే .

ఇది ఆనిమేటెడ్ సిరీస్ గా రాబోతుంది. తాజాగా ఈ సిరీస్ గురించి తెలుసుకునేందుకు ఢిల్లీ – ముంబై నుంచి మీడియా వాళ్ళు హైదరాబాద్ కి వచ్చారు . ఈ క్రమంలోనే మీడియా వాళ్లకి స్పెషల్ షో కూడా వేశారు . షో అనంతరం రాజమౌళి మీడియా వాళ్ళతో ముచ్చటించారు . ఈ క్రమంలోనే రాజమౌళి ను ఓ రిపోర్టర్ సినిమాకి సంబంధించి ఒక ప్రశ్న వేశారు .

“ఈ సినిమాలో ఎన్టీఆర్ ని తక్కువగా చేసి చరణ్ ని హైలెట్గా చేసి చూపించారు.. దానిపై ట్రోలింగ్ కూడా జరిగింది ..విమర్శలు కూడా వినిపించాయి.. దానిపై మీ స్పందన ఏంటి..?” అంటూ ప్రశ్నించారు. దీనికి మొఖం మాడ్చేసుకున్న రాజమౌళి.. అది ఇప్పుడు చెప్పడానికి సమయం కాదు.. ఇది సరైన వేదిక కాదు అంటూ మాట మార్చేశాడు . దీంతో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ కి కూడా ఇలాంటి పరిస్థితి తప్పలేదు అంటూ జనాలు ట్రోల్ చేస్తున్నారు..!