ఆ విషయంలో తప్పు నాదే..రాజమౌళి బహిరంగ క్షమాపణలు..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ బాగా బాగా వైరల్ గా మారింది . మనకు తెలిసిందే ఇండస్ట్రీలో వన్ అండ్ ఓన్లీ టాప్ డైరెక్టర్ ఎవరు అంటే అందరూ కళ్ళు మూసుకొని చెప్పే పేరు రాజమౌళి . దీని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఎలాంటి కంటెంట్ ఉన్న సినిమాలను తెరకెక్కిస్తారో మనకు తెలుసు . అయితే రాజమౌళికి మొదటి నుంచి ఒక మంచి పేరు ఉంది . ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాడు.. తప్పు చేయడు ..చాలామంది ఇదే విషయాన్ని చెబుతూ ఉంటారు .

అయితే తాజాగా రాజమౌళి మీడియా వాళ్లకు క్షమాపణలు చెప్పారు . దానికి సంబంధించిన వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. బాహుబలి 3 అనౌన్స్ చేశాడు రాజమౌళి. బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ అంటూ ఆనిమేటెడ్ సిరీస్ గా తీసుకొస్తున్నాడు . ఈ ఆనిమేటెడ్ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ కూడా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ హాట్ స్టార్ లో రిలీజ్ చేశారు . తాజాగా మీడియా వాళ్లకు స్పెషల్ షోస్ వేశారు .

అనంతరం మీడియా వాళ్ళతో ముచ్చటించారు రాజమౌళి . ఈ క్రమంలోనే ఒక రిపోర్టర్ రాజమౌళి గురించి గొప్పగా మాట్లాడుతూనే ..”ఇన్నేళ్లల్లో ఎప్పుడూ మీరు మీటింగ్ కి లేటుగా రాలేదు. ఇప్పుడు ఈ తప్పు తెలిసి చేశారా ..? తెలియకుండా చేశారా..? అంటూ వెటకారంగానే ప్రశ్నించాడు . దానికి రాజమౌళి స్పందిస్తూ ..”మీరు ఐదున్నరకు రమ్మన్నారు ..మీరు ఇచ్చిన సమయానికి అంటే నేను ముందే వచ్చాను ..ఒకవేళ నేను లేటుగా వచ్చాను అని.. మీరు అనుకుంటూ ఉంటే ..నా వల్ల మీరు ఇబ్బంది పడి ఉంటే సారీ ” అంటూ చెబుతూనే ది క్రౌన్ ఆఫ్ బ్లడ్ అనిమేటెడ్ సిరీస్ మే 17వ తేదీన స్ట్రీమింగ్ కాబోతుంది డిస్నీ హాట్ స్టార్ లో కచ్చితంగా చూసి ఎంజాయ్ చేయండి అంటూ చెప్పుకొచ్చారు . దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!