మరోసారి బాలయ్య సినిమాలో కాజల్.. కానీ అస‌లు ట్విస్ట్ ఇదే..?!

ఓ సినిమాలో హీరో, హీరోయిన్ కలిసి నటించారంటే.. మళ్ళీ వారిద్దరూ కలిసి చేయడానికి ఎంత సమయం పడుతుంది. ఇటీవల రోజుల్లో అయితే అది మరీ అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఓ సినిమాలో నటించి హిట్ కొట్టిన తర్వాత వెంటనే మరో సినిమా కూడా అదే హీరో, హీరోయిన్లు నటించడం అనేది గ‌తంలో ట్రేండ్‌గా ఉండేది. అలా వరుస పెట్టి విజయశాంతి, రాధా.. బాలయ్య, చిరంజీవి సినిమాల్లో నటిస్తూ ఉండేవారు. ఇప్పుడు ఆ ట్రెండ్ లేదు. ఈ క్ర‌మంలో మరోసారి బాలకృష్ణ, కాజల్‌తో క‌లిసిన‌టించి ఆ ట్రెండ్‌ రిపీట్ చేయనున్నారు అంటూ ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

Team NBK's Bhagavanth Kesari Unveils First Look Of Kajal Aggarwal On Her  Birthday

బ‌ల‌య్య చివ‌రిగా న‌టించిన‌ భగవంత్‌ కేసరితో భారీ సక్సెస్ అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాతో బాల‌య్య హ్యాట్రిక్ కొట్టి మంచి ఫామ్‌లోకి వ‌చ్చాడు. ఇక‌ బాలయ్య, బాబి డైరెక్షన్లో రానున్న.. ఎన్‌బీకే109 లోను ఈ జంట‌ కలిసి మ‌రోసారి నటిస్తున్నారంటూ వార్తలు వైరల్ గా మారాయి. ఇందులో ఊర్వశి రౌతెల‌ నటిస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఆమెది హీరోయిన్ పాత్ర కాదని.. ఆమె ఓ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుందంటూ ఫిలిం వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది.

Kajal Aggarwal BOLD Avatar

కాగా కాజల్ ఇందులో హీరోయిన్ అయ్యుంటుంది అనుకుంటే తడబడినట్టే. ఇందులో కాజల్ నెగటివ్ షేడ్స్‌లో నటిస్తోందని తెలుస్తుంది. మ‌రీ బాలయ్యకు జోడిగా నటించే హీరోయిన్ ఎవరు అనే ప్రశ్నకు ఇంకా సమాధానం రావాల్సి ఉంది. ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.