బాబాయ్ కి మద్దతుగా అబ్బాయ్.. మీ కోసం పోరాడే నాయకుడు ప‌వ‌న్‌ని గెలిపించండి లంటూ..?!

త్వరలోనే ఏపీ సార్వత్రిక ఎన్నికలు జరగనున్న క్రమంలో.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. దీంతో పవన్ కళ్యాణ్ ని గెలిపించేందుకు ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులు పిఠాపురంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నిన్న మొన్నటి వరకు జబర్దస్త్ లో కొంతమంది కమెడియన్స్ తో పాటు మెగా హీరోలు వరుణ్ తేజ్, వైష్ణవ్‌ తేజ్, సాయి ధరంతేజ్ కూడా ప్రచారంలో పాల్గొని పవన్ కళ్యాణ్ కు ఓటు వేయాలంటూ రోడ్ షోలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

Mega Star Chiranjeevi Campaigns for Pawan Kalyan Through Twitter

ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ని గెలిపించమంటూ చట్టసభలో ఆయన గొంతు వినిపించేలా చేయమంటూ పిఠాపురం ప్రజలకు విజ్ఞప్తి చేశాడు. సినిమాల్లో బలవంతంగా వచ్చిన రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంగా వచ్చాడంటూ చిరంజీవి వెల్లడించాడు. తన సొంత సంపాదనలు రైతుల క‌న్నిళ్ళు తుడిచేందుకు ఖర్చు పెట్టాడని.. సరిహద్దుల్లో ప్రాణాలు తెగించి పోరాడే సైనికుల కోసం పెద్ద మొత్తం అందించాడని, మత్స్యకారులకు సహాయం చేశాడని మరోసారి గుర్తు చేసిన చిరంజీవి ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావలసింది అంటూ.. జనమే జయమని నమ్మే జనసేనాని ని గెలిపించమంటూ పిఠాపురం ప్రజలకు విజ్ఞప్తి చేశాడు.

After Papa Chiranjeevi Ram Charan will now work with Uncle Pawan Kalyan पापा चिरंजीवी के बाद अब चाचा पवन कल्याण के साथ काम करेंगे राम चरण - India TV Hindi

మీ సేవకుడిగా, సైనికుడిగా, అండగా నిలబడతాడు. మీకోసం కలబడతాడు, మీ కలలను నిజం చేస్తాడు అంటూ చిరంజీవి చేసిన పోస్ట్ నెటింట‌ తెగ వైరల్ గా మారింది. ఇదే వీడియోను రామ్ చరణ్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. మీ భవిష్యత్తు కోసం పాటుపడే నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి అంటూ వివరించాడు. అంతేకాదు తన మద్దతు జనసేనకి ఉందంటూ స్పష్టం చేశాడు. ప్రస్తుతం రామ్ చరణ్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారుతుంది.