గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల..మరో హిట్ పక్కా..నో డౌట్..!

ఇది నిజంగా శ్రీ లీలకు వెరీ వెరీ జాక్ పాట్ ఛాన్స్ అనే చెప్పాలి . ఎందుకంటే ఈ మధ్యకాలంలో శ్రీ లీల ఆఫర్లు అందుకుంది తక్కువ . అది ఎందుకో కూడా మనకు తెలిసిందే. ఎందుకంటే గుంటూరు కారం సినిమా తర్వాత శ్రీ లీలాను జనాలు పట్టించుకోవడం మానేశారు . ఆమెను కేవలం గ్లామరస్ పాత్రల కోసం మాత్రమే మేకర్స్ వాడుకుంటున్నారు అంటూ ప్రచారం చేశారు. దీనితో తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు చాలా తక్కువగా దక్కించుకుంటూ వచ్చింది శ్రీ లీల.

అసలు ఇప్పుడు తెలుగులో కొత్త సినిమాలకే కమిట్ అవ్వలేదు. ఈ క్రమంలోనే కోలీవుడ్ ఇండస్ట్రీలో బడా బడా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంటూ వచ్చింది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తో ఓ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోబోతుందట . అదే విధంగా విజయ్ దళపతి నటిస్తున్న సినిమాలో ఐటమ్ సాంగ్ కూడా ఓకే చేసిందట . అంతేనా ఇప్పుడు ఏకంగా మరోసారి సినిమాకి ఓకే చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

శ్రీ లీల త్వరలోనే కార్తి నటించబోతున్న సినిమాలో హీరోయిన్గా నటించబోతుందట . మొదటిగా ఈ పాత్ర కోసం రష్మిక మందన్నా ను అనుకున్నారట. కాల్ షీట్స్ అడ్జెస్ట్ అవ్వని కారణంగా ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో శ్రీ లీలా జాక్పాట్ ఛాన్స్ కొట్టేసింది అంటూ ఓ న్యూస్ కోలీవుడ్ మీడియాలో బాగా వైరల్ గా మారింది . అంతేకాదు ఇది నిజంగా అమ్మడికి లక్కీ లక్కీ ఛాన్స్ అంటున్నారు జనాలు . తెలుగులో ఏ మాత్రం చక్రం తిప్పుతుందో ఈ బ్యూటీ అంటూ జనాలు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు..!!