తిరుపతిలో ప్రియుడిని వివాహం చేసుకోనున్న జాన్వి కపూర్.. స్టార్ బ్యూటీ క్లారిటీ..?!

బాలివుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం తారక్‌ సరసన దేవర సినిమాలో నటిస్తున్న ఈ అమ్మడు.. దేవర షూటింగ్ పూర్తికాకముందే రామ్ చరణ్ తో మరో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. కాగా జాన్వి కపూర్.. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనవడు శిఖర్ పహారియాతో ప్రేమలో ఉందంటూ గత కొంతకాలంగా రూమర్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి చాలా సార్లు కెమెరా కళ్ళకు చిక్కడం, తిరుమలలో కూడా కలిసి దైవ‌ దర్శనం చేసుకోవడం ఇలా ఎన్నోసార్లు నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నారు.

Maidaan Screening: Janhvi Kapoor spotted wearing 'Shiku' necklace in reference to her boyfriend Shikhar Pahariya - See pic | Business Upturn

కాగా తిరుపతిలో శిఖ‌ర్ పహారియాను.. జాన్వి కపూర్ త్వరలోనే పెళ్లి చేసుకుంటుందంటూ ఓ రూమర్ ఇంస్టాగ్రామ్‌లో వైర‌ల్ గా మారింది. అది జాన్వి కపూర్ కంటపడడంతో అమ్మే ఈ పోస్ట్ పై క్లారిటీ ఇచ్చేసింది. జాన్వీకపూర్ – శిఖ‌ర్‌ను వివాహం చేసుకుంటున్నారంటూ ఫొటోను ఓ యూజర్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా.. దానికి ఆమె రియాక్ట్ అవుతూ ” కుచ్ బి ” .. అంటూ కామెంట్ చేసింది. మీ పాపులారిటీ కోసం ఏదైనా రాసిస్తారా అని అర్థం వచ్చేలా ఆమె కామెంట్ ఉండడంతో.. తన పెళ్లి వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని క్లారిటీ వచ్చేసింది. ఇక జాన్వి కపూర్, శిఖ‌ర్‌ డేటింగ్ లో ఉన్నారంటూ ఇటీవల ఆమె హింట్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Janhvi Kapoor And Rumoured Boyfriend Shikhar Pahariya At Tirupati Temple

కాఫీ విత్ కరణ్‌ షో లో జాన్వి తన చెల్లి ఖుషి తో కలిసి పాల్గొంది. ఇందులో తన స్పీడ్ డైల్ లిస్టులో ఎవరి పేర్లు ఉంటాయి అనే ప్ర‌శ్న‌కు జాన్వీ బ‌దులిస్తూ.. తన తండ్రి, చెల్లి తో పాటు శిఖర్ పేరును కూడా వివరించింది. అలాగే ఇటీవల ముంబైలో మైదాన్ సినిమా ప్రీమియర్‌కు జాన్వి కపూర్ హాజరై సందడి చేసింది. ఈ ఈవెంట్ లో వైట్ డ్రెస్ ధరించి ముద్దుగా కనిపించిన జాన్వి.. శిఖు అని పేరు ఉండే చేను ధరించి అందర్నీ ఆకట్టుకుంది. తన బాయ్ ఫ్రెండ్ శిఖర్ ముద్దు పేరును అలా లాకెట్‌గా ధరించి మరోసారి తమ రిలేషన్ గురించి వార్తల్లో వైరల్ గా మారింది. అలాగే ఈ ఏడాది మార్చిలో వీరిద్దరూ కలిసి తిరుమల ఆలయాన్ని దర్శించుకున్న సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు మరింత బలం చేకూరింది.