‘ సుస్వర మ్యూజిక్ ‘ 21వ వార్షికోత్స‌వంతో మార్మోగిన డ‌ల్లాస్‌.. చంద్ర‌బోస్‌కు స‌త్కారం

ఉత్తర అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ పట్టణంలో శాస్త్రీయ సంగీత శిక్షకురాలు సుస్వర మ్యూజిక్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షురాలు అయినటువంటి డాక్టర్ మీనాక్షి అనుపిండి ఆధ్వర్యంలో ఆదివారం గ్రాండ్ సెంటర్ ఆడిటోరియంలో మ్యూజిక్ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా కుమారి సంహిత అనిపిండి, శ్రీమతి ప్రత్యూష వ్యవహరించారు. సుస్వర మ్యూజిక్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షురాలు అయిన డాక్టర్ మీనాక్షి అనుపిండి సుస్వర మ్యూజిక్ అకాడమీని స్థాపించి దాదాపు 21 ఏళ్ళ నుంచి ప్రతి సంవత్సరం ఎంతో గ్రాండ్ గా ఈ సంస్థ యొక్క వార్షికోత్సవాలను నిర్వస్తున్నారు.

ఎంతో అట్టహాసంగా సాగిన ఈ కార్యక్రమానికి తెలుగు సినీ పరిశ్రమకు చెందినటువంటి ప్రపంచ సాహిత్య వేదిక చైర్మన్ తోటకూర ప్రసాద్, వ్యాపారవేత్త కంచర్ల శ్రీ కిషోర్, ఇండో అమెరికన్ కౌన్సిల్ సభ్యులు శ్రీ గోపాల్ పోనంగి, శారదా సింగిరెడ్డి, శ్రీ ప్రకాష్ రావు, ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ పి పట్నాయక్, టాలీవుడ్ దర్శకుడు విఎన్ ఆదిత్య హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మీనాక్షి తన మ్యూజిక్ యూనిట్ తో కలిసి ఏడు సిగ్మెంట్లలో 30కి పైగా సంగీత కీర్తనలు ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు.

అనంతరం సుస్వర సాహిత్య కళానిధి అనే బిరుదు ఇచ్చి చంద్రబోస్ ను సత్కరించారు. అలాగే చంద్రబోస్ సొంత గ్రామం అయినటువంటి చల్లగరిగెలో ప్రారంభించిన ఆస్కార్ గ్రంథాలయ నిర్మాణానికి 15వేల డాలర్స్ విరాళాలు కూడా అందించారట. అలాగే ఈ కార్యక్రమంలో RP. పట్నాయక్ తన పాటలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈయనకు కూడా సుస్వర నాధానిధి అనే బిరుదుతో సత్కరించారు.