బాలయ్య డైరెక్టర్ కి వార్నింగ్ ఇచ్చిన రామ్ చరణ్.. చచ్చిన ఇక ఆయనతో సినిమా చేయడా..? ఏమైందంటే..?

రామ్ చరణ్ ..చాలా సైలెంట్ పర్సన్. ఈ విషయం మన అందరికీ తెలిసిందే. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతాడు ..అంతేకాదు ఎవరు హర్ట్ కాకుండా మాట్లాడడంలో రామ్ చరణ్ తర్వాతే ఎవరైనా .అయితే అలాంటి రాంచరణ్ కూడా ఒక డైరెక్టర్ కి వార్నింగ్ ఇచ్చారట. ఆ న్యూస్ ఇండస్ట్రీలో బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది. ఆ డైరెక్టర్ మరెవరో కాదు బోయపాటి శ్రీను. రామ్ చరణ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వినయ విధేయ రామ .

ఈ సినిమాలో కియర అద్వానీ హీరోయిన్గా నటించింది . ఈ సినిమా డిజాస్టర్ టాక్ అందుకుంది . మరీ ముఖ్యంగా ఈ సినిమాలో రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ పరమ చెత్తగా ఉంది అంటూ ట్రోలింగ్కి గురి చేశారు జనాలు . అయితే ఈ సినిమా రిలీజ్ అయిన టైంలో మేకర్స్ డిస్ట్రిబ్యూటర్ల మధ్య పెద్ద గొడవే జరిగింది . ఆ టైంలో చిరంజీవి ఇన్వాల్వ్ అయినా సరే పరిస్థితి సర్ధుమణగలేదు.

అంతేకాదు చాలా చాలా టఫ్ సిచువేషన్ ఫేస్ చేశారు చరణ్ ..అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి . అదే టైంలో బోయపాటి పరోక్షంగా రామ్ చరణ్ ను వేరే వాళ్ళ దగ్గర అనకూడని మాటలు కూడా అన్నారట . ఇది తెలిసిన రామ్ చరణ్ పరోక్షంగా బోయపాటి కు కాల్ చేసి మరి వార్నింగ్ ఇచ్చాడు అంటూ ప్రచారం జరిగింది . అంతేకాదు బోయపాటితో ఇక చచ్చినా కూడా సినిమాలో నటించకూడదు అంటూ అప్పుడే డిసైడ్ అయిపోయాడట రామ్ చరణ్..!!