నా సినిమాకి పోటీన అంటూ స్టార్ డైరెక్టర్‌ను బెదిరించిన‌ చెర్రీ.. చివరకు ఏం జరిగిందంటే..?!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ పరంగా బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్న రామ్ చరణ్.. సెట్ లో కానీ బయట కానీ అందరితో సరదాగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఇక 2019 సంక్రాంతి పండుగ కానుకగా రామ్ చరణ్ నుంచి వినయ విధేయ రామ, అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఎఫ్2 థియేటర్లో రిలీజ్ అయ్యి ఎఫ్2 సినిమా భారీ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలకు కొన్ని నెలలు ముందు చర‌ణ్‌, అనిల మధ్యన ఓ సరదా సంభాషణ జరిగిందట. ఓ ఈవెంట్లో అనుకోకుండా రాంచరణ్.. రావిపూడిని కలిశారట‌.

నా సినిమాకే పోటీనా అంటూ ఆ డైరెక్టర్ కు చరణ్ వార్నింగ్.. చివరికి ఏమైందంటే

ఆ టైంలో రామ్ చరణ్, అనిల్ రావిపూడితో.. నా సినిమాకే పోటిగా నీ సినిమాను రిలీజ్ చేస్తున్నావా అంటూ ఫన్నీ కామెంట్ చేశాడని.. రామ్ చరణ్ అలా కామెంట్ చేయడంతో అనిల్ రావిపూడి షాక్ అయ్యారని తెలుస్తుంది. ఆ తర్వాత రాంచరణ్.. అనీల్‌ను హగ్ చేసుకుని సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుంటున్నా అంటూ చెప్పారట‌. రామ్ చరణ్ అలా చెప్పడంతో అనిల్ రావిపూడి రిలాక్స్ అయ్యాడట. ఇక ప్రస్తుతం ఈ న్యూస్‌ వైరల్ అవ్వడంతో అంత ఆశ్చర్యపోతున్నారు. రామ్ చరణ్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ సినిమా వస్తే బాగుంటుందని ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు.

ఇక రామ్ చరణ్ రేంజ్ ఎప్పటికప్పుడు మరింతగా పెరుగుతుంది. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్న రామ్ చరణ్.. శంకర్ డైరెక్షన్లో గేమ్స్ చేంజర్‌ సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమాను ఎలాగైనా ఈ ఏడాదిలోపు పూర్తి చేసి రిలీజ్ చేయాలని ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. ఎప్పుడెప్పుడు సినిమాని చూస్తామా అంటూ మెగా ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రామ్ చరణ్ కి కేవలం సౌత్ లోనే కాకుండా ఇతర భాషల్లోనూ భారీ పాపులారిటీ ఏర్పడింది.