పవర్ స్టార్ కాలికి గాయం.. ఆందోళనలో ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..?!

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్ర ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారాల్లో భాగంగా బిజీ బిజీగా గడుపుతున్నాడు జనసేనాని పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కాలికి గాయమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ తిరుపతిలో వారాహి విజయ భేరి యాత్ర నిర్వహించేందుకు వెళ్ళాడు. ఈ యాత్ర కోసం ఆయన రేణిగుంట ఎయిర్పోర్ట్ కు చేరుకున్ని విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న టైం లో ఆయన కుడికాలు బొటనవేలుకి కట్లు వేసి కనిపించాయి. అయితే పవన్ కాలికి ఏమైంది అనే విషయంపై ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు.

దానికి తోడు ఆయన వేగంగా నడవకుండా చాలా నెమ్మదిగా నడుస్తూ కెన్‌వాయి ఎక్కడాన్ని అభిమానులు గుర్తించారు. అయితే అసలు పవన్ కాలికి ఏమైంది.. అనే విషయం పై జనసేన నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ బయటకు రాక‌పోవ‌డంతో.. ఆ గాయం ఎలా తగిలింది.. అస‌లు ఏం జ‌రిగి ఉంటుంది అనే ఆందోళన అభిమానుల్లోనూ, జనసైనికల్లోనూ మొదలైంది. ఇక ఇంత శ్రమిస్తూ పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పాల్గొంటున్న‌ తరుణంలో పవన్ కళ్యాణ్ కు మద్దతుగా దాదాపు టాలీవుడ్ మొత్తం కదిలి వస్తుంది. తాజాగా ఆయన సోదరుడు చిరంజీవి.. పవన్ కు మద్దతుగా ఓ వీడియోను రిలీజ్ చేశాడు.

Pawan Kalyan Begins Election Yatra In Varahi Campaign Truck - DriveSpark

ఈ క్రమంలో నాని, రాజ్ తరుణ్, తేజ సజ్జ లాంటి యంగ్ హీరోలు జనసేనకి ఓటు వేసి గెలిపించాలంటు తమ మ‌ధ్ధ‌తూ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కే అంటూ షేర్ చేసుకున్నారు. ఇక రాంచరణ్ తేజ్ కూడా తండ్రి వీడియోను షేర్ చేస్తూ పవన్ కళ్యాణ్ ని గెలిపించమంటు కోరాడు. రానున్న రోజుల్లో మరింత మంది హీరోలు, హీరోయిన్స్ కూడా పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలుపుతారు అంటూ తమ నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు జనసేన ఫ్యాన్స్. ఈ క్రమంలో ఇంకా కేవలం ఆరు రోజులు మాత్రమే ఎన్నికలకు మిగిలి ఉంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి.