విశాఖ‌: ఎన్నిక‌ల‌కు ముందు భ‌ర‌త్‌కు క‌ష్టాలు.. చాలా సీక్రెట్లు భ‌య‌ట‌ప‌డుతున్నాయ్‌..?

ఎన్నిక‌ల‌కు మ‌రో నాలుగు రోజులు టైం మాత్ర‌మే ఉంది. ఈ టైంలో కొంద‌రు నేత‌ల‌కు సంబంధించిన కీల‌క విష‌యాలు బ‌య‌ట‌కు వస్తుండ‌డంతో ఆ పార్టీ నేత‌ల‌తో పాటు ఆ నేత‌ల అనుచ‌రుల్లో ఎక్క‌డా లేని టెన్ష‌న్లు స్టార్ట్ అవుతున్నాయి. కీల‌క‌మైన విశాఖ పార్ల‌మెంటు సీటు నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా గీతం శ్రీ భ‌ర‌త్ పోటీలో ఉన్నారు. భ‌ర‌త్‌కు ఈ ఎన్నిక‌లు చావోరేవో.. గ‌త ఎన్నిక‌ల్లోనే ఓడిపోయాడు. ఈ సారి కూడా భ‌ర‌త్ ఓడిపోతే మ‌నోడు అస‌లు రాజ‌కీయాల్లో మ‌నుగ‌డ సాధించ‌డం క‌ష్ట‌మే అవుతుంది.

అటు వైసీపీ నుంచి బీసీ మ‌హిళ‌గా బొత్స ఝాన్సీ అంచ‌నాల‌కు మించి గ‌ట్టి పోటీ ఇస్తున్నారు. ప్ర‌జ‌ల్లో సింప‌తీ వ‌ర్క‌వుట్ కావ‌డం లేద‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చేసిన భ‌ర‌త్ ఇప్ప‌టికే ధ‌న‌ప్ర‌వాహంతో గ‌ట్టెక్కాల‌ని చూస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఇప్పుడు భ‌ర‌త్ పై ఉన్న కేసుల వివ‌రాలు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చేశాయి. ఇవి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో వీటి గురించి చ‌ర్చ న‌డుస్తోంది. బెంగళూరులోని గీతం క్యాంపస్ లో విద్యార్థుల భద్రతపై సరైన ప్రమాణాలు పాటించకపోవడం వల్లే తన కుమారుడు బ్రహ్మసాయి రెడ్డి క్యాంపస్ బిల్డింగ్ పై నుంచి దూకి మరణించాడని… దీనికి కారణం సంస్థ అధినేత భరత్ నిర్లక్ష్యమేనని దాసరి వెంకట శివారెడ్డి ఫిర్యాదు చేశారు. దీనిపై 2024లో బెంగళూరునిలో దొడబళ్లాపుర పోలీస్టేషన్ లో సెక్షన్ 304(ఏ) కింద భరత్ పై కేసు నమోదైంది.

ఇక అక్క‌డే గీతం విద్యా సంస్థ నిర్మాణం పూర్తయినా సరే, డబ్బులు చెల్లించడం లేదంటూ ఎంఎస్ రామయ్య ప్రై లిమిటెట్ సంస్థ శ్రీ భరత్ పై దొడబళ్లాపుర పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో 505, 379, 380, 420, 448, 323, 506 (బీ) సెక్షన్లపై కేసు నమోదు అయిన‌ట్టు స‌మాచారం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అస‌లే విశాఖ సిటీలో నాలుగు సీట్ల‌లో వైసీపీ పుంజుకుంది. అటు ఎస్ కోట‌లోనూ ఆ పార్టీకే బలం ఉంది. ఈ టైంలో శ్రీ భ‌ర‌త్ గురించి ఈ కేసుల వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు రావ‌డం కూడా భ‌ర‌త్‌ను ఇర‌కాటంలో ప‌డేసిన‌ట్ల‌య్యింది. ఇది స‌హ‌జంగానే యాంటీ వ‌ర్గాలు బాగా వైర‌ల్ చేస్తున్నాయి.