ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న వీఆర్ శ్రీలక్ష్మీ

ప్రజల సమస్యలు తీర్చగల ఏకైక నేత నారా చంద్రబాబు నాయుడు అని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వీఆర్ శ్రీ లక్ష్మీ శ్యామల తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో శ్రీ లక్ష్మీ శ్యామల పాల్గొన్నారు. కందుకూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో నాగేశ్వరరావు ఘన విజయం సాధిస్తారన్నారు వీఆర్ శ్రీ లక్ష్మీ శ్యామల.

మరో వారం రోజుల్లో ఏపీలో వైసీపీ కథ ముగుస్తుందన్నారు. టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి రూపొందించిన మేనిఫెస్టో పట్ల ప్రజలు ఎంతో సంతోషంతో ఉన్నారన్నారు. టీడీపీ సూపర్ సిక్స్ పథకాలు అన్నివర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకుని రూపొందించారన్నారు వీఆర్ శ్రీ లక్ష్మీ శ్యామల. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనతో ప్రజలు విసుగెత్తిపోయారని… మే 13న తమ తీర్పు చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు వీఆర్ శ్రీ లక్ష్మీ శ్యామల. ఇప్పటికే వైసీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందన్నారు. ఐదేళ్లల్లో ప్రజలకు చేసిన ఒక్క మేలు కూడా వైసీపీ నేతలు చెప్పలేకపోతున్నారని ఎద్దేవా చేశారు వీఆర్ శ్రీ లక్ష్మీ శ్యామల.

ఈ సందర్బంగా వీఆర్ శ్రీ లక్ష్మీ శ్యామల మాట్లాడుతూ తెలుగురాష్ట్రాల్లో 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించారని… ఆయన ఎన్నో ప్రాజెక్టులను ఏపీకి తీసుకువచ్చారన్నారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ప్రస్తుతం అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో అవసరమన్నారు. ఐదేళ్లుగా అప్పులు చేయటం తప్ప జగన్ చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. 2019లో వైసీపీకి ఓటు వేసి తప్పు చేశామని ప్రజలు తలలు పట్టుకుంటున్నారన్నారు. అభివృద్ధికి బ్రాండ్‌ అంబాసిడర్ చంద్రబాబు అని… అభివృద్ధి, సంక్షేమం అమలు చేయగల సత్తా ఉన్న ఏకైక నేత చంద్రబాబు అని వీఆర్ శ్రీ లక్ష్మీ శ్యామల వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు ఘన విజయం సాధించడం ఖాయమన్నారు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వీఆర్ శ్రీ లక్ష్మీ శ్యామల.