అధినేత మాటంటే లెక్కే లేదా…!

తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకు మారు పేరు. పార్టీ అధినేత చెప్పిందే ఫైనల్. పార్టీ లైన్ దాటిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకునేందుకు అయినా సరే… అధినేత చంద్రబాబు వెనుకడుగు వేయరనేది సీనియర్ నేతలకు బాగా తెలుసు. అయితే కొందరు జూనియర్ నేతల తీరు వల్ల ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి, పార్టీకి, అధినేత చంద్రబాబుకు కూడా చెడ్డ పేరు వస్తోంది. తొలి నుంచి పార్టీలోనే కొనసాగుతున్న నేతలంతా ఇప్పటికీ పార్టీ నియమాలకు కట్టుబడి ఉంటున్నారు. కానీ మధ్యలో […]

ఆ పార్టీల్లో వారికి గుర్తింపు తక్కువేనా….!

తెలుగుదేశం పార్టీ అంటే.. అందరికి ఠక్కున గుర్తుకు వచ్చే కులం కమ్మ. వాస్తవానికి ఏపీలో ఒక్కొ పార్టీనీ ఒక్కో కులం సొంతం చేసుకుందనటంలో సందేహం లేదు. టీడీపీని చౌదరీలు, జనసేనను కాపులు, వైసీపీని రెడ్డి సామాజిక వర్గం సొంతం చేసుకుంది. ఈ పార్టీ మాది అని గొప్పగా ప్రకటించుకుంటున్నారు కూడా. అయితే ఇప్పుడు ఆయా పార్టీలకు సొంత సామాజిక వర్గాలే దూరమవుతున్నాయనటంలో సందేహమే లేదు. ఇంకా చెప్పాలంటే.. అధినేతలే ఆయా వర్గాలను నిర్లక్ష్యం చేయడం వల్ల కొందరు […]

పదవీ కాలం ముగిసింది…. అయినా అధికారంలో ఎలా…?

పదవి వ్యామోహం ఏ స్థాయిలో ఉంటుందో… ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పదవి కోసం పార్టీలు మారే వాళ్లు ఇప్పుడు చాలా మంది ఉన్నారు. నిన్నటి వరకు తిట్టిన నోటీతోనే… పదవి ఇచ్చిన పార్టీ నేతను ఆకాశానికి ఎత్తేస్తుంటారు కూడా. ఇక పదవిలో ఉన్న వారు అయితే… నిబంధనలను కూడా గాలికి వదిలేస్తున్నారు. ప్రభుత్వాలు మారినా సరే… పదవి కోసం కావాల్సిన అడ్డదార్లు అన్నీ తొక్కేస్తున్నారు కూడా. పార్టీ అధికారంలో లేకపోయినా సరే… తనదే పెత్తనం అంటున్నారు […]

ఏపీలో నామినేటెడ్ పదవులపై ఫుల్ క్లారిటీ…!

ఏపీలో నామినేటెడ్ పదవుల కోలాహలం తారాస్థాయికి చేరుకుంది. ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కూడా నిండకముందే… పదవుల కోసం నేతలంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ముందుగా పదవుల కేటాయింపులో కూడా ఈసారి టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే ఎవరెవరికి ఏ పదవి ఇవ్వాలనే విషయంపై ఇప్పటికే ఓ అవగాహన వచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవానికి గతంలో పదవుల కేటాయింపు విషయంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలపై పార్టీ నేతలతో పాటు కార్యకర్తలు కూడా […]

పనిచేశాం… పదవులివ్వండి సార్…!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం – జనసేన – భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ గెలుపు కూడా ఎలా ఉందంటే… ప్రతిపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వంలో 24 మందికి మంత్రి పదవులు దక్కాయి. వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం కొత్త మంత్రులతో కళకళలాడుతోంది. శాఖల కేటాయింపు పూర్తి కావడంతో.. మంత్రులంతా తమకు కేటాయించిన ఛాంబర్‌లలో మార్పులు […]

ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న వీఆర్ శ్రీలక్ష్మీ

ప్రజల సమస్యలు తీర్చగల ఏకైక నేత నారా చంద్రబాబు నాయుడు అని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వీఆర్ శ్రీ లక్ష్మీ శ్యామల తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో శ్రీ లక్ష్మీ శ్యామల పాల్గొన్నారు. కందుకూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో నాగేశ్వరరావు ఘన విజయం సాధిస్తారన్నారు వీఆర్ శ్రీ లక్ష్మీ శ్యామల. మరో వారం రోజుల్లో ఏపీలో వైసీపీ కథ […]

వామ్మో… ఆ టీడీపీ అభ్యర్థి ఇలాంటి వాడా…!

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలనేది అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ లక్ష్యం. ఇప్పటికే రెండు పార్టీలు తమ తమ అభ్యర్థులను ప్రకటించేశాయి. వైసీపీ అధినేత ముందు నుంచి చెబుతున్నట్లుగానే సుమారు 50 మంది కొత్త వారికి టికెట్లు ఇచ్చారు. అయితే టీడీపీ మాత్రం దాదాపు పాతవారికే టికెట్లు ఇచ్చింది. అదే సమయంలో టీడీపీకి సరైన నాయకత్వం లేని నియోజకవర్గంలో చివరి నిమిషంలో పార్టీలో చేరిన వారికి టికెట్లు ఇచ్చారు చంద్రబాబు. ఇవే […]

టీడీపీలో ప్రయోగాలు…. వైసీపీలో మాత్రం…!

ఏపీలో రాజకీయాల్లో ప్రస్తుతం ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలకు ఇంకా 6 నెలల సమయం ఉన్నప్పటికీ… అభ్యర్థుల ఎంపికపై ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నాయి. ఇక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అయితే… గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నడూ లేనట్లుగా రెండేళ్ల ముందే అభ్యర్థులను ప్రకటించేశారు కూడా. ఇటు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా తమ పార్టీ తరఫున పోటీ చేసే వారికి క్లారిటీ ఇచ్చేస్తున్నారు. వాస్తవానికి […]

బాబు నోట… పదే పదే అదే మాట… వారే టార్గెట్…!

చంద్రబాబు నాయుడు అంటే ఠక్కున గుర్తుకు వచ్చే మాట ఒకటే… తమ్ముళ్లు… హైదరాబాద్ నేనే డెవలప్ చేశాను… ఈ సెల్‌ఫోన్ నేనే తీసుకువచ్చాను… ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ… అధికారంలో ఉన్నప్పుడు… ఆ తర్వాత కూడా చంద్రబాబు ఇదే మాట పదే పదే చెప్పుకొచ్చారు. ఒకదశలో టీడీపీ అభిమానులు… ఇంకా ఎంతకాలం ఇలా చెప్తారు సార్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. ఇక ప్రతిపక్ష నేతలైతే… హైదరాబాద్ అంతకు ముందు లేదా.. అంటూ సూటిగా ప్రశ్నించారు కూడా. […]