నో నో అంటూనే..విడాకులు తీసుకోబోతున్న స్టార్ కపుల్..? అభిమానులకి బిగ్ షాక్ ఇచ్చారుగా..!

ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో విడాకులు తీసుకుంటున్న జంటలు మరీ ఎక్కువగా మారిపోతున్నారు. ప్రేమ తగ్గిపోతుందో ..? లేకపోతే ప్రేమ అన్న మోజులో త్వరగా పెళ్లి చేసుకుంటున్నారో..? అర్థం కావడం లేదు . ఎంతో మెచ్యూరిటీగా బిహేవ్ చేయాల్సిన స్టార్ సెలబ్రిటీస్ కూడా కొన్ని కొన్ని నిర్ణయాలను కోపంలో తీసుకుంటూ లైఫ్ లో కోల్కోలేని దెబ్బలను ఎదుర్కోవాల్సిన సిచువేషన్స్ ఫేస్ చేస్తున్నారు . తాజాగా సోషల్ మీడియాలో ఒక స్టార్ సెలబ్రిటీకి సంబంధించిన విడాకుల మేటర్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న రన్వీర్ సింగ్ హీరోయిన్ దీపికా పదుకొనే జంట గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఈ కపుల్ బాలీవుడ్ ఇండస్ట్రీలో కోట్లు ఖర్చుపెట్టి పెళ్లి చేసుకున్న జంటలలో వీళ్లు కూడా ఒకరు .

ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట వైవాహిక జీవితాన్ని చక్కగా గడుపుతూ వచ్చింది. అయితే ఏమైందో ఏమోగానీ సడన్గా రన్వీర్ సింగ్ దీపికాల మధ్య యవ్వారం చెడ్డింది అంటూ వార్తలు వినిపించాయి . ఒకానొక మీడియా ఈవెంట్లో రన్వీర్ సింగ్ ఫోటోకి ఫోజులు ఇవ్వమన్నా కూడా దీపికా పదుకొనే చేతులు దులిపేసుకుని వెళ్ళిపోయింది . అప్పటినుంచి వీళ్లిద్దరి మధ్య ఏదో తేడా కొట్టింది అన్న వార్త బాగా వైరల్ అయింది . అయితే రీసెంట్గా దీపికా పదుకొనే రన్వీర్ సింగ్ విడాకులు తీసుకోబోతున్నారు అన్న ప్రచారం బాలీవుడ్ మీడియాలో ఊపందుకుంది.

దానికి కారణం రన్వీర్ సింగ్ తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా నుంచి డిలీట్ చేయడమే. ఈ ఊహించని పరిణామంతో ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీస్ షేక్ అయిపోతుంది . ఎందుకంటే దీపిక ప్రెగ్నెంట్ ఈ విషయాన్ని ఓపెన్ గా అఫీషియల్ గా బయటపెట్టారు . ఆగస్టులో తమ బిడ్డకు జన్మనివ్వబోతున్నామంటూ కూడా చెప్పారు మరి అలాంటి జంట ఈ టైంలో విడాకులు తీసుకుంటుందా..? అంటూ షాక్ అయిపోతున్నారు . అయితే ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీస్ విడాకులు తీసుకునే ముందు ఇలానే చేస్తున్నారు. సోషల్ మీడియాలో అకౌంట్ నేమ్ మార్చేయడం పెళ్లి ఫోటోలను డిలీట్ చేసేయడం లాంటివి చేస్తున్నారు . అలా చేసిన ప్రతి ఒక్కరు కూడా విడాకులు తీసుకుంటున్నామని ప్రకటన చేయడం గమనార్హం . ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో రన్వీర్ సింగ్ దీపికా పదుకొనే పేర్లు వైరల్ గా మారాయి..!!