ఇన్నేళ్ల తన కెరీర్ లో సుకుమార్ ఎప్పుడూ కూడా ఆ తప్పు చేయలేదు ..మీరు గమనించారా..!

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇండస్ట్రీలో సుకుమార్ పేరు రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . దానికి కారణం కూడా మనకి తెలుసు. త్వరలోనే రిలీజ్ కాబోతున్న పుష్ప2. గతంలో ఆయన ఎంతో ఇష్టంగా తెరకెక్కించిన పుష్ప వన్ సినిమాకి ఈ మూవీ సీక్వెల్ గా రాబోతుంది. పుష్ప 2 కోసం ఏ రేంజ్ లో కష్టపడుతున్నారో సుకుమార్-బన్నీ మనకు తెలిసిందే. కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో సుకుమార్ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. సుకుమార్ 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు .

దాదాపు రెండు దశాబ్దాలకు పైగానే ఇండస్ట్రీలో రాజ్యం ఏలేస్తున్నాడు . కాగా అలాంటి సుకుమార్ ఎప్పుడూ కూడా తన కెరీర్ లో ఓ తప్పు మాత్రం చేయలేదు . దానికి సంబంధించిన డీటెయిల్స్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . జగడం అనే సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఇంట్రడ్యూస్ అయ్యాడు సుకుమార్ . ఆ తర్వాత ఆర్య సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. కాగా సుకుమార్ ఇన్నేళ్ల తన కెరియర్ లో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా న్యూడ్ సీన్స్ చిత్రీకరించిన దాఖలాలు లేవు .

అంతేకాదు అమ్మాయిల బాడీపై వల్గర్ గా సీన్ చిత్రీకరించిన దృశ్యాలు కూడా లేవు . ఇంకా పక్కాగా చెప్పాలంటే హీరోయిన్స్ ని నాచురల్ అందంగా చూపిస్తారు . రంగస్థలం సినిమాలో హీరోయిన్ సమంత ని..పుష్ప సినిమాలో హీరోయిన్ శ్రీవల్లి పాత్రలో కనిపించిన రష్మికను ఎంత అందంగా చూపించాడో మనకు తెలిసిందే. అలా సుకుమార్ ఎప్పుడూ కూడా అమ్మాయిల విషయంలో హద్దులు మీర లేదు . ఈ మధ్యకాలంలో కొందరు డైరెక్టర్స్ అమ్మాయిలపై ఎలాంటి కుళ్ళు జోకులు వేస్తూ సీన్స్ తెరకెక్కిస్తున్నారో తెలిసిందే. అలాంటి వాళ్లు సుకుమార్ ని చూసి నేర్చుకోండి అంటూ సుకుమార్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు..!!