ఆ స్టోరీకు రొమాంటిక్ సన్నివేశాలు చాలా అవసరం.. జాన్వి కపూర్ బోల్డ్ కామెంట్స్ వైరల్..?!

దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వికపూర్ కు ప్రత్యేక పరిచ‌యం అవసరం లేదు. శ్రీదేవి నట వారసత్వాన్ని పునికి పుచ్చుకుంటూ బాలీవుడ్‌లో చోటు సంపాదించుకున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం హీరోయిన్గా దూసుకుపోతుంది. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న జాన్వి.. తన మత్తు కళ్ళతో కుర్రాళ్ళ మనసులు దోచేస్తుంది. ఇక ప్రస్తుతం జాన్వి కపూర్ టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యింది. ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

5 times we could hard relate with Janhvi Kapoor - Cosmopolitan India

అలాగే జాన్వీ కపూర్ మరో భారీ బడ్జెట్ తెలుగు సినిమాల్లో హీరోయిన్గా సెలెక్ట్ అయింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో అమ్మె ఛాన్స్ అందుకుంది. ఇలా వరుసగా టాలీవుడ్‌ టాప్ హీరోల సినిమాల్లో ఆఫర్లు అందుకుంటూ అందరిని ఆశ్చ‌ర్య ప‌రుస్తున్న ఈ అమ్మ‌డు.. సోషల్ మీడియాలోను ఫుల్ బిజీగా ఉంటూ తన హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ళ మతిపోగొడుతుంది. ఇదిలా ఉంటే బాలీవుడ్ మీడియాలో జాన్వి కపూర్ నటిస్తున్న మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమా గురించి చాలా పెద్ద రచ్చే జరిగింది. ఈ సినిమాలో హౌస్ వైఫ్ గా జాన్వి కపూర్.. ఆమె భర్తగా రాజకుమార్‌రావు డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తున్నారు. భార్యాభర్తల మధ్య బంధం ఎలా ఉండాలి, క్రీడ నేపథ్యంలో ఈ సినిమా తెర‌కెక్కుతుందని సమాచారం.

Mr And Mrs Mahi To Release In April 2024 Janhvi Kapoor Rajkummar Rao  Starrer Directed By Sharan Sharma - Entertainment News: Amar Ujala - Mr And Mrs  Mahi:मिस्टर एंड मिसेज माही की

అయితే కథ డిమాండ్ మేరకు ఇందులో ఓ రొమాంటిక్ సీన్ గురించి దర్శకుడు సరన్‌ శర్మ జాన్వికి వివరించారని.. ఆమె ససైమీరా అన్నదని తెలుస్తుంది. కానీ దర్శకుడు విడ‌మ‌ర్చి చెప్పి స‌ర్ధి చెప్ప‌డంతో జాన్వికి ఆ సీన్ లో నటించక‌ తప్పలేదట. ఈ క్రమంలో ఈ సన్నివేశాలపై ముంబై మీడియాలో రకరకాల కథనాలు మొదలయ్యాయి. వాటిపై జాన్వీ కపూర్ స్పందిస్తూ.. కథకు ఆ సన్నివేశం చాలా అవసరం. పాత్ర డిమాండ్ మేరకు నటించాల్సి వచ్చింది. ఎక్కడ బోల్డ్ గా లేకుండా భార్యా, భర్తల ప్రేమ మాత్రమే అందులో కనిపించేలా అద్భుతంగా శరన్ శర్మ ఈ సన్నివేశాన్ని తెరకెక్కించాడు. నటిగా ఈ సినిమా నాకు చాలెంజింగ్ అనిపించింది అంటూ వివరించింది జాన్వి. అయితే ఈ సినిమా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.