హ్యాట్రిక్ హిట్లతో బాలకృష్ణ జోరు

సక్సెస్ కోసం బాలయ్య భలే ప్లాన్ వేస్తున్నాడు. ఏ మాత్రం రిస్క్ తీసుకోకుండా ఓ సూపర్ షార్ట్ కట్ పట్టాడు. మరో రెండు, మూడేళ్ల దాకా ఏ టెన్షన్ లేని స్ట్రాటజీని ఫాలో అవుతున్నాడు. ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలిస్తే ఔర అనేస్తున్నారు.

నందమూరి నటసింహం బాలకృష్ణ టైం నడుస్తోంది. సీనియ‌ర్ హీరోల్లో బాల‌య్య ఫుల్ స్వింగ్ లో క‌నిపిస్తున్నాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టేసిన బాలయ్య అన్ స్టాపబుల్‌గా దూసుకుపోతున్నాడు. రీసెంట్‌గా అడవి బిడ్డ నేలకొండ భగవంత్ కేసరిగా.. బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబడుతున్నాడు నందమూరి నటసింహం. క్రికెట్ మేనియా కొనసాగుతున్న హౌస్ ఫుల్ కలెక్షన్లతో దుమ్మురేపుతున్నాడు. దీంతో అవలీలగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయి.. బయ్యర్లకు లాభాలు తెచ్చిపెట్టాడు. దాదాపు రూ.130 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి బాక్సాఫీస్ షేక్ చేస్తున్నాడు. పైగా ఈ వారం పెద్ద సినిమాలేవీ విడుదల కాకపోవడంతో భగవంత్ కేసరిదే డామినేషన్ కానుంది. ఈ వారమే కాదు.. ఇంకో వారం పాటు కేసరిదే హవా కొనసాగనుంది. మంచి ఊపుమీదున్న బాలయ్య అదే జోష్ కంటిన్యూ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. అందుకోసం ఓ మాస్టర్ ప్లాన్‌తో రంగంలోకి దిగడం హాట్ టాపిక్‌గా మారింది.

హ్యాట్రిక్ హిట్లతో దూసుకుపోతున్న బాలయ్య కోసం కుర్ర డైరెక్టర్ల నుంచి సినీయర్ డైరెక్టర్లు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ బాబీతో బాలయ్య సినిమా చేస్తున్నాడు. రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో పొలిటికల్ ఫ్యామిలీ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత తనకు గ్రాండ్ విక్టరీలు అందించిన డైరెక్టర్లతోనే బాలయ్య జతకట్టేందుకు రెడీ అవుతున్నాడన్న టాక్ నడుస్తోంది. అఖండతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఊరమాస్ డైరెక్టర్ బోయపాటితో జతకట్టనున్నట్లు తెలుస్తోంది. అలాగే సంక్రాంతి రేస్‌లో విజయకేతనం ఎగరవేసిన గోపిచంద్ మలినేనితో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట. అంతేకాక రీసెంట్‌గా హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడితో మరో మూవీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ ముగ్గురు డైరెక్టర్లతో బాలయ్యకు మంచి బాండింగ్ కుదరడంతో మళ్లీ నటించేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నాడట. అంతేకాక బాలయ్య కోసం అదిరిపోయే స్టోరీలను రెడీ చేసినట్లు ఫిల్మ్ నగర్ సర్కిల్‌లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో డైరీ నింపేసుకున్న బాలయ్య కాల్షిట్లు దొరకాలంటే మరో ఐదేళ్లు ఆగే పరిస్థితి నెలకొంది. మొత్తానికి హిట్లిచ్చిన డైరెక్టర్లను బాలయ్య రిపీట్ చేస్తుండటంతో నందమూరి ఫ్యాన్స్‌కి పండుగ చేసుకుంటున్నారు.