దేవర దండుతో బొమ్మ దద్దరిల్లిపోవాల్సిందే..

పాన్ ఇండియా మహిమో.. లేక పాతచింతకాయ పచ్చళ్లకు చెక్ పెట్టాలన్న సంకల్పమో కానీ.. కొత్త సంచలనాలకు తెరతీస్తోంది దేవర. బాక్సాఫీస్ షేక్ చేయాలంటే.. బౌండరీస్ దాటడం తప్పదని ఫిక్స్ అవుతున్నాడు. సినిమాను నెక్ట్స్ లెవల్ అనేలా తీర్చిదిద్దుతూ సెన్సేషన్‌కు కేరాఫ్‌గా మారుతున్నాడు. అందుకోసం ఓ రేంజ్ లో దండును దింపుతున్నారన్న మ్యాటర్ ఇంట్రెస్టింగ్ గా మారింది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీ దేవర టాలీవుడ్ సెన్సేషన్‌గా మారుతోంది. ఆచార్య తర్వాత డైరెక్టర్ కొరటాల శివ హై ఓల్టేజ్ యాక్షన్‌ ఎంటర్టైనర్‌గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. సముద్రం బ్యాక్ డ్రాప్‌లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా పాన్ ఇండియా లెవల్‌లో చిత్రీకరిస్తున్న ఈ మూవీ కోసం డైరెక్టర్ కొరటాల భారీ స్కెచ్ వేస్తున్నాడన్న న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ప్రజెంట్ గోవాలో పవర్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్ ను నెక్ట్స్ లెవల్ అనేలా తెరకెక్కించనున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ షెడ్యూల్ తర్వాత కర్ణాటకకు లోకేషన్ షిఫ్ట్ అవుతున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. హాలీవుడ్ టెక్నీషియన్స్ చేత వీర లెవల్ లో మాస్ సీన్లను తెరకెక్కిస్తున్నట్లు బయటకు వస్తోన్న రోజుకో అప్ డేట్ వైరల్ గా మారుతోంది. ఇప్పటికే బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ తారక్ కు బ్యాడ్ భాయ్ గా మారితే… బీటౌన్ బ్యూటీ రొమాన్స్ కు రెడీ రెడీ అయింది. ఇక శివగామి ఎంట్రీ… స్పెషల్ రోల్ లో విశ్వక్ సేన్ అంటూ గత కొన్ని రోజులుగా రూమర్లు వినిపిస్తుండగా ఇప్పుడు మరో యాక్టర్ యాడ్ అవుతుందన్న టాపిక్ చర్చనీయాంశంగా మారింది.

దేవరలో భయం అంటే తెలియదంటూ వీర్రవీగే వారికి భయాన్ని పరిచయం చేసే పవర్‌ఫుల్‌ పాత్రలో తారక్‌ కనిపించనున్నాడట. గ్యాప్ లేకుండా యాక్షన్ తో.. యంగ్ టైగర్ కుమ్మేస్తుండగా… ఈ సినిమాకి సంబంధించి బయటకు వస్తున్న ఒక్కో అప్‌డేట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే ఓ కీలకమైన క్యారెక్టర్ లో రమ్యకృష్ణ నటిస్తుందని… నవంబర్ నుంచి షూటింగ్ లో పాల్గొంటుందని ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇంటర్వెల్ తర్వాత కథ మొత్తం మరో మలుపు తిరగబోతుందని అది కూడా రమ్యకృష్ణ పాత్రతోనే అని వార్తలు వినిపిస్తున్నాయి. మునుపెన్నడూ కనిపించనంత కొత్తగా కనిపించనున్నారట. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ కోసం మంచు లక్ష్మిని రంగంలోకి దింపుతున్నారట. చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందని.. కొరటాల శివ తనదైన స్టైల్‌లో ఆ పాత్రని డిజైన్ చేశారని టాక్. తారక్ కు అక్కగా కనిపించనుందని… ఇప్పటికే మేకర్స్ అప్రోచ్ అవ్వగా.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి రోజు రోజుకు పెరుగుతున్న దేవర దండుతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. మరి కొరటాల కొత్త స్కెచ్ బాక్సాఫీస్ పై ఎలాంటి సునామి సృష్టిస్తుందో చూడాలి.