నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. తన అద్భుతమైన నటనతో, డాన్స్ తో కొట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఎన్టీఆర్ ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్‌ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ దక్కించుకుని పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక ఎటువంటి పాత్రలోనైనా ఇట్టే పరకాయ ప్రవేశం చేసే ఎన్టీఆర్ సినీ కెరీర్‌లో టాప్ 10 పవర్ ఫుల్ రోల్స్ ఏంటో ఒకసారి చూద్దాం.
బాల రామాయణం (శ్రీరాముడు):
గుణశేఖర్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. నీలిమేగా శ్యాముడిగా అంత చిన్న వయసులోనే అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. విమర్శకులతో ప్రశంసలు అందుకున్నాడు. ప్రముఖ డ్యాన్సర్ స్మిత మాధవి ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన సీతగా నటించింది.
అదుర్స్ (చారి):
ఎన్టీఆర్ డ్యూయల్ రోల్‌లో నటించిన మూవీ అదుర్స్. ఇందులో బ్రాహ్మణ యువకుడైన నరసింహచారి పాత్రలో ఎన్టీఆర్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బనవించాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ చారి పాత్రకు జంటగా నయనతార నటించింది.
యమదొంగ (యముడు):
ఎస్.ఎస్ రాజమౌళి డైరెక్షన్లో రూపొందిన యమదొంగ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ యముడి సింహాసనాన్ని ఆక్రమించిన సామాన్య మానవుడి పాత్రలో నటించాడు. యముడి సింహాసనాన్ని చేజక్కించుకొని యంగ్ యమ రోల్‌లో ఎన్టీఆర్ అదరగొట్టాడు. యముడి పాత్రలో మోహన్ బాబు, ఎన్టీఆర్ కూడా పోటాపోటీగా నటించారు.
సింహాద్రి (సింగమలై) :
సింహాద్రి మూవీలో తనకు మేలు చేసే కుటుంబానికి అన్యాయం చేసిన వాళ్ళ ఆట కట్టించేందుకు కేరళ ప్రాంతంలో సింగంలైగా అవతారం ఎత్తాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ సినిమా కూడా రాజమౌళి దర్శకత్వంలో రూపొందింది.
రాఖి (రాఖి):
కృష్ణవంశీ డైరెక్షన్‌లో ఇలియానా, చార్మి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ రాఖీ పాత్రను పోషించాడు. వరకట్న బాధితురాలు అయిన తన చెల్లిని అన్యాయంగా హతమారుస్తారు. ఇలాంటి అన్యాయం మరే ఆడపిల్లకు జరగకూడదని భావించిన రాఖి ఆడపిల్లల మాన, ప్రాణ సంరక్షణ కోసం వారికి అండగా నిలబడతాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకు కోట్లాదిమంది మహిళలు అభిమానులుగా మారారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటన మగువకు కంటతడి పెట్టించే విధంగా ఉంది.
టెంపర్ (ఇన్స్పెక్టర్ దయ):
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కాజల్ హీరోయిన్గా నటించిన మూవీ టెంపర్. ఈ సినిమాలో ఇన్స్పెక్టర్ దయ పాత్రలో ఎన్టీఆర్ మెప్పించాడు. మొదట్లో దయలేని ఓ పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన ఎన్టీఆర్ తరువాత ఆడపిల్లల మానం హరించిన నరరూప రాక్షసులకు శిక్ష పడేలా చేసేందుకు తన ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమవుతాడు. ఈ సినిమా పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో రూపొందింది.
నాన్నకు ప్రేమతో (అభిరామ్):
నాన్నకు ప్రేమతో సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అభిరామ్ పాత్రలో మెప్పించాడు. ఫాదర్ సెంటిమెంట్‌తో రూపొందిన ఈ సినిమాలో తండ్రికి అన్యాయం చేసిన ఓ ప్రముఖ వ్యాపారవేత్తను దెబ్బతీసి పగ తీర్చుకోవడానికి టెక్నికల్‌గా తన తెలివితేటలను వాడుకొని ఇంటర్‌ప్రిన్యుర్ గా మారుతాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటన చాలా డిఫరెంట్ గా ఉంది. దీంతో ఈ సినిమాలో తన నటనకు మంచి మార్కులు కొట్టేసాడు.
జై లవకుశ (త్రిపాత్రాభినయం):
ఎన్టీఆర్ తన కెరీర్ లో మొదటిసారి జై లవకుశ సినిమా ద్వారా త్రిపాత్రాభినయం చేశాడు. తన కుటుంబంలో తన ఫ్యామిలీలో అతడిపై చూపించిన డిఫరెన్స్ లు చెడ్డవాడిగా మార్చిన ఓ యువకుడు జై పాత్రలో ఎన్టీఆర్ నటించాడు. ఈ పాత్ర రామాయణంలోని రావణుని పోలి ఉంటుంది. దీనికి సోదరులుగా లవ, కుశ అనే రెండు పాత్రలు కూడా ఎన్టీఆరే పోషించాడు.
జనతా గ్యారేజ్ (ఆనంద్):
ఈ సినిమాలో మొదట ప్రకృతి ప్రేమికుడుగా కనిపించిన ఎన్టీఆర్ ఆనంద్ పాత్రలో మెప్పించాడు. పేద ప్రజలకు అండగా నిలిచే జనతా గ్యారేజ్ అధినేత సత్యంకి వెన్నముఖగా ఎన్టీఆర్ వ్యవహరిస్తాడు. సత్యం పాత్రలో జాతీయ అవార్డు గ్రహీత మోహన్‌లాల్ నటించారు. వీరిద్దరూ ఒకరికి మించి ఒకరు పోటీగా ఈ సినిమాలో నటించారు.
ఆర్ ఆర్ ఆర్ (కొమరం భీమ్):
జూనియర్ ఎన్టీఆర్ నటనను ప్రపంచానికి చాటి చెప్పిన మూవీ ఆర్‌ఆర్‌ఆర్. ఈ సినిమాలో కొమరం భీముడి పాత్రలో ఎన్టీఆర్ నటన అమోఘం. తెలంగాణ గోండు జాతీ హక్కులకై పోరాడిన విప్లవకారుడు కొమరం భీముని క్యారెక్టర్‌లా ఈ పాత్ర ఉంటుంది. ఈ సినిమాకు గాను ఎన్టీఆర్‌కి ఎంతోమంది విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇక ఎన్టీఆర్ నటనకు వెరైటీ అనే ఓ హాలీవుడ్ ప్రముఖ పత్రిక ఆస్కార్ అవార్డ్ పొందేందుకు అర్హుడు అనే కితాబు కూడా ఇచ్చింది.
ఏది ఏమైనా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ యంగ్ టైగర్ సంపాదించుకున్నాడు. ఎంత కష్టమైనా డైలాగునైనా స్పష్టంగా పలకగలిగే కెపాసిటీ ఉన్న ఎన్టీఆర్.. తాతకు తగ్గ మనవడుగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.