హీరోయిన్ల‌ను మించిన అందంతో ఉన్న ఈ స్టార్ క్రికెట‌ర్ భార్య ఎవ‌రో తెలుసా..!

స్టార్ క్రికెటర్ కేశవ్ మహారాజ్ ఎలాంటి ఆటగాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ప్రపంచకప్ లో దక్షిణాఫ్రికాకు ఐదోసారి విజయాన్ని అందించాడు మహారాజ్.1990లో డర్బన్‌లో జన్మించిన కేశవ మహారాజ్‌ 49 టెస్ట్ మ్యాచ్‌లో 158 వికెట్లు తీశాడు. కేశవ మహారాజ్ 37 వ‌న్డే ఇంట‌ర్నేషనల్ మ్యాచ్‌ల‌లో 44 వికెట్లు పడగొట్టగా. 26.. t20 మ్యాచ్స్‌ 22 వికెట్లు తీశాడు. 33 పరుగులు 4 వికెట్లు పడగొట్టడం వన్డేలో అతని గ్రేట్ బౌలింగ్. ఇక కేశవ్ మహారాజ్ కు భారతదేశంతో పాత అనుబంధం ఉంది. కేశవ హనుమాన్ కి గొప్ప భక్తుడు అంతే కాకుండా అతని బ్యాట్ పై ఓం గుర్తు ఉంటుంది.

అతని తండ్రి కూడా క్రికెటర్ అయిన అంతర్జాతీయంగా ఆడే అవకాశం రాలేదు. మహారాజ్ మ‌న దేశంలో ఆట ఆడటానికి వచ్చినప్పుడు తిరువనంతపురంలో దేవుని దర్శనం చేసుకున్నాడు. ఇక అటువంటి హనుమంతుడి భక్తుడిని కూడా ఓ అమ్మాయి తన అందంతో వలలో వేసుకుంది. ఆమె లేరీష మున్సామి. గొప్ప కథక్ డ్యాన్స‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్న లెరీషా అందం ముందు.. స్టార్ హీరోయిన్లు కూడా దిగదుడుపే. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులను ఆకట్టుకుంటుంది లెరీషా. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 53.8 కే ఫాలోవర్లను కలిగి ఉంది.

ఇక మహారాజ్, లెరీషా ఇద్దరు భారతీయ సంతతికి చెందిన వారే. వీళ్ళిద్దరూ ఒక కామన్‌ ఫ్రెండ్ ద్వారా కలుసుకున్నారు. ఇరు కుటుంబాలు భారతదేశం నుండి వలస వచ్చి దక్షిణాఫ్రికాలో సెటిల్ అయ్యాయి. కేశవ్ ఎక్కడైనా ఆడెందుకు వెళ్లినప్పుడు లెరీఫా కూడా అతని ఆటను చూస్తూ ప్రోత్సహించడానికి స్టేడియం కి వెళ్ళేది. త్వరలోనే వీరి స్నేహం ప్రేమగా మారింది. వీరిద్దరూ చాలా కాలం ప్ర‌పంచానికి ప్రేమను దాచిపెట్టారు. లిరీషా కేశవ మహారాజు కుటుంబానికి ఒప్పించడానికి ఎంతగానో కష్టపడింది.

కేశ‌వ్‌ తన తల్లిదండ్రులకు లిరీష‌ని పరిచయం చేయడానికి స్పెషల్ డేని ఎంచుకున్నాడు. మహారాజ్ తల్లి 50వ‌ పుట్టినరోజు సందర్భంగా ఈ వేడుకల్లో లెరీషా కథ‌క్‌ నృత్యాన్ని ప్రదర్శించింది ఈ డాన్స్ తో పాటు లిరీషాను చూసిన కేశవ్ మహారాజ్ తల్లి, తండ్రి ఇద్దరు ఫ్లాట్ అయిపోయారు. మా ఇంటి కోడలుగా ఇలాంటి పిల్లే రావాలంటూ వారు తమ ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇక 2019లో నిశ్చితార్థ వేడుక ద్వారా ఒకటైన ఈ జంట కరోనా మహమ్మారి కారణంగా దాదాపు మూడు సంవత్సరాలు దూరంగా ఉన్నారు. ఇక 2022 ఏప్రిల్ లో ఇద్దరు మూడుముళ్ల బంధంతో ఒకటి అయ్యారు.