మెగా 156 సినిమాలో హీరోయిన్‌గా ఈ బ్యూటి.. దెబ్బ‌కి రేంజ్ మారింది..

మెగాస్టార్ చిరంజీవికి టాలీవుడ్‌లో ఎటువంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మెగాస్టార్ రీ ఎంట్రీ తర్వాత ఊహించిన సక్సెస్ అందుకోలేకపోతున్నాడు. ఆయన రీయంట్రీ ఇచ్చిన దగ్గర్నుంచి కేవలం ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య సినిమాలు తప్ప మిగతావి ఏవి ఆయన రేంజ్ కు తగ్గట్టుగా కలెక్షన్లు అందుకోలేక‌పోయాయి. అదే బాటలో తాజాగా చిరంజీవి నటించిన బోళా శంకర్ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచి నిర్మాతలకు, బయ్యర్లకు భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. దీంతో మెగాస్టార్ తన నెక్స్ట్ నటించబోతున్న 156వ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

బింబిసారా డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఇప్పటికే కొన్ని పోస్టర్లు రిలీజై మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు చంద్రబోస్ స్వరాలు అందిస్తున్నాడు. సోషియా ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కనుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని తీసుకుంటున్నారంటూ న్యూస్ వైరల్ అవుతుంది. నిన్న మొన్నటి వరకు అసలు ఏమాత్రం క్రేజ్ లేని మీనాక్షి చౌదరి గుంటూరు కారం సినిమాల్లో అవకాశాన్ని దక్కించుకోవడంతో ఆమెకే అమాంతం క్రేజ్ పెరిగిపోయింది.

ఇక త్రివిక్రమ్ ఏదైనా హీరోయిన్ కు అవకాశం ఇచ్చాడంటే ఆమెకు వరుస అవకాశాలు క్యూక‌డతాయి ఆమె ఫీట్ మారిపోతుందని ఇండస్ట్రీలో ఎప్పటినుంచో టాక్ ఉంది. గతంలో త్రివిక్ర‌మ్ దెబ్బ‌కి సమంత, పూజా హెగ్డే కి కూడా ఇలాగే వరుస ఆఫర్లు వచ్చి స్టార్ హీరోయిన్గా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మీనాక్షి చౌదరికి కూడా త్రివిక్రమ్ దెబ్బతో ఫేట్ మారిపోయింది. గుంటూరు కారం సినిమాలో నటిస్తున్న మీనాక్షికి మరో ఛాన్స్ త్రివిక్రమే ఇచ్చాడు.

పుష్ప టు తర్వాత ఐకాన్ స్టార్ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమాకు కూడా మీనాక్షి చౌదరిని హీరోయిన్గా ఎంపిక చేసాడట. గోపీచంద్ మలినేని – రవితేజ కాంబోలో వస్తున్న సినిమాకు కూడా మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించబోతుందట. అలాగే ప్రభాస్ – మారుతి కాంబినేషన్ లో వస్తున్న కామెడీ ఎంటర్టైనర్ లో ప్రభాస్ కు ఫ్లాష్ బ్యాక్ ఒకటి ఉంటుంది.. ఆ ఫ్లాష్ బ్యాక్ లో ప్రభాస్ స‌ర‌సన మీనాక్షి నటించబోతుందని న్యూస్ వినిపిస్తుంది. ఇలా ప్రస్తుతం మీనాక్షి చౌదరి చేతినిండా సినిమాలు ఉన్నాయి.