దళపతి విజయ్‌ రాజకీయ ఎంట్రీపై హింట్..!

దళపతి విజయ్‌కు కోలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి అస్సలు వివరించనక్కర్లేదు. విజయ్ సినిమా వచ్చిదంటే.. ప్రచారం బాధ్యతను వారే తీసుకుంటారు.. మూవీ మేకర్స్ కంటే ఎక్కువ పబ్లిసిటీ చేస్తుంటారు. అందుకే ప్లాప్‌ సినిమాలైనా అయినా సరే మినిమమ్ వసూళ్లతో బయటపడుతుంటాయి. అంతటి ఆదరణ ఉంది విజయ్ కు అభిమానుల్లో. విజయ్ కు కూడా ఫ్యాన్స్ అంటే చాలా ఇష్టం. తన సక్సెస్ సంతోషాన్ని ప్రతిసారి అభిమానులతో పంచుకుంటాడు. అయితే తాజాగా లియో సక్సెస్‌ మీట్ వేదికగా ఆసక్తికర అంశాలను పంచుకున్నాడు. అంతేకాక ఒక్కడే సూపర్ స్టార్.. ఒక్కడే తల అంటూ అతడు రజనీకాంత్, అజిత్ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సోషల్ మీడియాలో టైమ్ వెస్ట్ చెయొద్దని.. ఫ్యూచర్ లో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని చెప్పుకొచ్చాడు విజయ్. ఒకరకంగా.. ఫ్యూచర్ లో తన రాజకీయ అరంగేట్రం ఉండే అవకాశముందనే హింట్ ఇండైరెక్టుగా ఇచ్చాడు. అందుకోసం అందరూ ప్రిపేర్డ్ గా ఉండాలన్నట్టుగా మాట్లాడాడు. ఇదే సమయంలో ఫ్యాన్ వార్స్ కు చెక్ పెట్టే ప్రయత్నం చేశాడు.‌ ఇక కుందేళ్ల వేటకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా పంచుకున్నాడు. అభిమానులు పెద్ద లక్ష్యాలను పెట్టుకోవాలని.. ఆ దిశగా అడుగులు వేయాలని కోరాడు. తమిళంలో ఒక్కరే ఎంజీ రామచంద్రన్, ఒక్కరే శివాజీ గణేశన్ ఉన్నారని.. అలాగే ఒక్కరే విజయ్ కాంత్, ఒక్కరే రజినీ కాంత్, ఒక్కరే కమల్ హాసన్ ఉన్నాడని చెప్పిన విజయ్.. దళపతి కూడా ఒక్కడేనని చెప్పుకొచ్చాడు. అభిమానులు రాజు అయితే.. తాను సేవకుడిని అంటూ వివరించాడు. ఓవరాల్ గా విజయ్ స్పీచ్ కోసం ఎదురుచూసిన వారందరికి మాంచి కిక్ ఇచ్చాడు