కుర్ర హీరోను ప‌ట్టేసిన ముదురు బ్యూటీ…!

సినీ ఇండస్ట్రీలో హిట్ కాంబినేషన్ అయితే హీరో – హీరోయిన్ల మధ్య వయసు వ్యత్యాసం అనేది పెద్దగా పట్టించుకోరు. అప్పటికే ప్రేక్షకులు ఆ జోడిని తెరపై చూసి హిట్ మోజులో ఉంటారు. కాబట్టి ఆ వ్యత్యాసాన్ని వారు పట్టించుకోరు. మరి ఒక్కసారి ఆ జంట కనుక ఫెయిల్ అయితే ఎలాంటి సీన్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నో రకాల విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే వీలైనంతవరకు మేకర్స్ అలాంటి ఏజ్ గ్యాప్ లేని కాంబినేషన్లు సెట్ చేస్తూ ఉంటారు. సూపర్ క్రేజ్ ఉన్న భామలకు ఇది కాస్త మినహాయింపు గానే ఉన్నా.. ఇక కొత్త భామల జోలికి అయితే అసలు వెళ్లారు.

యంగ్ హీరోలు వయసుకు తగ్గట్టుగా హీరోయిన్లను సెలెక్ట్ చేస్తూ ఉంటారు. తాజాగా బాలీవుడ్ కుర్ర హీరో ఇషాన్ కట్ట‌ర్‌తో.. మృణాల్‌ ఠాగూర్ రోమాన్టిక్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ కాంబినేషన్ సెటై చాలా నెలలు అవుతున్న రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో వారిద్దరి మధ్య వయసు వ్యత్యాసం గుర్తొస్తుంది. బ్రిగేడియర్.. బలరాం సింగ్ జీవిత గాధను ఆధారంగా వార్ డ్రామాగా.. రాధాకృష్ణ మీనన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బ‌యోపిక్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రొమాన్స్ పెద్దగా హైలెట్ కాదు. అయితే సినిమాలో కావాల్సినంత రొమాన్స్ ఉందని సమాచారం.

ఇక వీరిద్దరి మధ్య కూడా ఏజ్ గ్యాప్‌ ఉంది. ఈషన్ కట్టర్ వయ‌స్సు 28 ఏళ్ళు కాగా మృణాల్‌ ఠాగూర్ 31. దీంతో వీరిద్దరి మధ్యన ఉన్న ఏజ్ గ్యాప్ పెద్ద సమస్యగా కాకపోవచ్చు. ఈ సినిమా ఎలా ఉన్నా యాక్సెప్టబుల్గానే ఉంటుంది. 10 – 15 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉన్న భామలతోనే కుర్ర హీరోలు రియల్ రొమాంటిక్ ట్రాక్ నడుపుతున్నారు. ఉదాహరణకు మలైకా అరోరా – అర్జున్ కపూర్ లాంటివారు. కాబట్టి స్క్రీన్ పై వయసు వ్యత్యాసం ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. ఇక బాలీవుడ్ లో కుర్ర హీరోలతో రొమాన్స్ సన్నివేశాలు పండించిన సీనియర్ హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు.