కుప్పంలో శ్రీకాంత్ దూకుడు..లక్ష రీచ్ అవుతారా?

కుప్పంని సొంతం చేసుకోవాలని వైసీపీ ఎన్ని రకాలుగా రాజకీయం చేస్తుందో చెప్పాల్సిన పని లేదు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పంపై వైసీపీ ఫోకస్ పెట్టింది. అధికార బలాన్ని ఉపయోగించుకుని అక్కడ బలపడాలని వైసీపీ ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో లోకల్ ఎన్నికల్లో గెలిచింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంలోనే తిష్ట వేసి..వైసీపీని బలోపేతం చేస్తున్నారు. ఇటు చంద్రబాబు కూడా దూకుడు పెంచారు. కుప్పంలో వైసీపీకి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా చేయాలని చూస్తున్నారు. వైసీపీ చేస్తున్న […]

వేణు వర్సెస్ బోస్..ఆగని రచ్చ..ఇండిపెండెంట్‌గా రెడీ.!

అధికార వైసీపీలో ఆధిపత్య పోరు తగ్గడం లేదు. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య పోరు తారస్థాయిలో నడుస్తుంది. ఇక గత కొన్ని రోజులుగా రామచంద్రాపురం నియోజకవర్గంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. వాస్తవానికి రామచంద్రాపురం బోస్ సొంత సీటు..మూడు సార్లు అక్కడ బోస్ గెలిచారు. గత ఎన్నికల్లో వేణుకు ఆ సీటు ఇచ్చారు..దీంతో ఆయన గెలుపు కోసం బోస్ సహకరించారు. ఇటు బోస్ మండపేటలో […]

బీసీలపై కాంగ్రెస్ గురి..ఆ సీట్లు ఫిక్స్.!

తెలంగాణలో కూడా కులాల వారీగా రాజకీయం నడుస్తుంది. ఎక్కడకక్క కులాల ఓట్లని ఆకర్షించడమే లక్ష్యంగా బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు ముందుకెళుతున్నాయి. ఇప్పటికే దళితబంధు అని దళితులని, ఇటు బీసీల లక్ష సాయం అంటూ..బి‌సిలని..అటు మైనారిటీలకు సాయం అంటూ వారిని..ఇలా అందరినీ ఆకట్టుకునేలా కే‌సి‌ఆర్ రాజకీయం చేస్తున్నారు. ఇక కే‌సి‌ఆర్ కు ధీటుగా కాంగ్రెస్ కూడా రాజకీయం చేస్తుంది. వారు కూడా బలమైన బీసీలని ఆకట్టుకోవడానికి వారికి ప్రతి పార్లమెంట్ లో రెండు అసెంబ్లీ సీట్లు కేటాయిస్తున్నామని ప్రకటించారు. మొత్తంగా […]

రామచంద్ర కొత్త పార్టీ..ఎవరి కోసం? వెనుక ఎవరు ఉన్నారు?  

ఏపీలో మరో కొత్త పార్టీ వచ్చింది. ప్రముఖ పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్ కొత్త పార్టీ ప్రకటించారు. తాజాగా నాగార్జున యూనివర్సిటీ వద్ద భారీ సభ ఏర్పాటు చేసి..ఆ సభ సాక్షిగా  భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. అయితే బీసీలకు రాజ్యాధికారం దక్కడమే టార్గెట్ గా ఈ పార్టీని ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. ఇక ఈయన కొత్తగా పార్టీ ఎందుకు పెట్టారు. పార్టీ సక్సెస్ అవుతుందా? అసలు దీని వెనుక ఎవరు […]

బాబు బస్సు యాత్ర..టార్గెట్ అదే.!

గత కొన్ని రోజులుగా టి‌డి‌పి అధినేత చంద్రబాబు ప్రజల్లో ఉండటం లేదు..కేవలం ఆయన పార్టీ పరమైన కార్యక్రమాలనే చూసుకుంటున్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటనలకు వెళ్ళడం లేదు. గత నెలలో కుప్పంలో మూడు రోజులు పర్యటించారు. ఆ తర్వాత నుంచి ఆయన ప్రజల్లోకి వెళ్లలేరు. పార్టీ పరంగా నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు..పార్టీ బలోపేతంపై చర్చలు చేస్తున్నారు. అలాగే ఇంచార్జ్‌లని చోట..కొత్తగా ఇంచార్జ్‌లని నియమిస్తున్నారు. ఇలా పార్టీ పరమైన కార్యక్రమాలే చేస్తూ వచ్చారు. […]

రాయదుర్గం వైసీపీలో రచ్చ..ఎమ్మెల్యేకు సెగలు.!

ఏపీలో అధికార వైసీపీలో ఎక్కడకక్కడ ఆధిపత్య పోరు తారస్థాయిలో జరుగుతున్న విషయం తెలిసిందే. సొంత పార్టీ నేతలే ఆధిపత్య పోరుకు దిగుతున్నారు. ఒకరినొకరు చెక్ పెట్టుకునే దిశగా వెళుతున్నారు. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సెగలు ఎక్కువ ఉన్నాయి. కొందరు ఎమ్మెల్యేలని సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో సీటు ఇవ్వవద్దని డిమాండ్ చేస్తున్నారు. సీటు ఇస్తే టి‌డి‌పి కాదు..తామే ఓడిస్తామని వైసీపీ నేతలు అంటున్నారు. ఇదే సమయంలో తాజాగా ఉమ్మడి అనంతపురం జిల్లా రాయదుర్గం వైసీపీలో […]

బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ రెడీ..ఆ ఎమ్మెల్యేలకు కేసీఆర్ హ్యాండ్.!

తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడిపోయింది..మరో రెండు, మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో గెలవడం కోసం ప్రధాన పార్టీలు సరికొత్త వ్యూహాలతో ముందుకెళుతున్నాయి. ఈ క్రమంలోనే హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్న సి‌ఎం కే‌సి‌ఆర్..అభ్యర్ధుల లిస్ట్ కూడా రెడీ చేస్తున్నారని తెలిసింది. ఈ ఆగష్టు నెలలోనే కే‌సి‌ఆర్ అభ్యర్ధుల లిస్ట్ రిలీజ్ చేస్తారని తెలిసింది. 75 మందితో మొదటి లిస్ట్ వదులుతారని సమాచారం..అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేల అందరికీ సీట్లు ఇస్తామని కే‌సి‌ఆర్ పలుమార్లు చెప్పారు. […]

బాబు-పవన్ మరోసారి భేటీ..ఇంకా సెట్ అయినట్లేనా?

టి‌డి‌పి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి భేటీ కానున్నారు. ఇటీవల ఎన్డీయే సమావేశానికి వెళ్లొచ్చిన పవన్..పొత్తులపై కామెంట్ చేస్తున్న విషయం తెలిసిందే. టి‌డి‌పి-జనసేన-బి‌జే‌పి పొత్తు ఉంటుందని పవన్ అంటున్నారు. అయితే దీనిపై చంద్రబాబు మాత్రం స్పందించడం లేదు. ఇటు టి‌డి‌పి శ్రేణులు ఏమో పొత్తు వద్దు ఒంటరిగానే బరిలో ఉందామని అంటున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి బాబు-పవన్ భేటీ అవుతున్నారని తెలిసింది. ఇప్పటికే ఆ ఇద్దరు మూడుసార్లు భేటీ అయిన విషయం తెలిసిందే. […]

కమలంలో ఆరని చిచ్చు..మాజీ సీఎంతో చిక్కులు.!

తెలంగాణ బి‌జే‌పిలో అంతర్గత పోరు ఆగేలా లేదు..బండి సంజయ్‌All Postsని అధ్యక్ష పదవి నుంచి తప్పించక ముందు నుంచి కమలంలో చిచ్చు రగులుతుంది. ఇప్పుడు కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన స్టేజ్ పైనే బి‌జే‌పిలో విభేదాలు కనిపించాయి. ఈ క్రమంలో బండి సంజయ్..సొంత పార్టీలోని కొందరు నేతలని టార్గెట్ చేసి..జాతీయ నాయకత్వానికి తనపై కొందరు లేనిపోని ఫిర్యాదులు చేశారని, ఇకనైనా అలాంటి వాటిని మానుకోవాలని హితవు పలికారు. కిషన్‌రెడ్డినైనా ప్రశాంతంగా పనిచేసుకోనివ్వాలని అన్నారు. అయితే బండిని […]