బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ రెడీ..ఆ ఎమ్మెల్యేలకు కేసీఆర్ హ్యాండ్.!

తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడిపోయింది..మరో రెండు, మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో గెలవడం కోసం ప్రధాన పార్టీలు సరికొత్త వ్యూహాలతో ముందుకెళుతున్నాయి. ఈ క్రమంలోనే హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్న సి‌ఎం కే‌సి‌ఆర్..అభ్యర్ధుల లిస్ట్ కూడా రెడీ చేస్తున్నారని తెలిసింది. ఈ ఆగష్టు నెలలోనే కే‌సి‌ఆర్ అభ్యర్ధుల లిస్ట్ రిలీజ్ చేస్తారని తెలిసింది. 75 మందితో మొదటి లిస్ట్ వదులుతారని సమాచారం..అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేల అందరికీ సీట్లు ఇస్తామని కే‌సి‌ఆర్ పలుమార్లు చెప్పారు.

కానీ అలా చేస్తే పార్టీకే నష్టం జరుగుతుంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఎక్కువ ఉంది. ఈ నేపథ్యంలో అలాంటి వారికి సీట్లు ఇస్తే గెలుపు కష్టమవుతుంది. కాకపోతే కే‌సి‌ఆర్ ఏమో అందరికీ సీట్లు ఇస్తానని ప్రకటించారు. దీంతో ఎమ్మెల్యేలు తమకే సీటు అని ఆశతో ఉన్నారు. అలాంటప్పుడు సీటు ఇవ్వకపోతే..వారు పార్టీ జంప్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఆగష్టులోనే 75 మందితో మొదటి లిస్టుని కే‌సి‌ఆర్ రిలీజ్ చేస్తారని తెలిసింది.

అయితే 104 మంది బి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యేల్లో 25 మందికిపైగా సిటింగ్‌లపై తీవ్ర వ్యతిరేకత, మరో 25కి పైగా స్థానాల్లో కొంతమేర వ్యతిరేకత ఉన్నట్లు తేలిందని తెలుస్తోంది. వీటిలో తీవ్ర వ్యతిరేకత ఉన్న స్థానాల్లో కొత్త అభ్యర్థులను బరిలోకి దింపుతారన్న చర్చ జరుగుతోండగా, ఆ స్థానాల్లో ఏ రకంగా చూసినా పార్టీ గెలుపు కష్టమేనన్న అభిప్రాయానికి రావడంతో.. అభ్యర్థిని మార్చే వ్యూహం అమలు చేస్తారని సమాచారం.

అదే సమయంలో తమపై వ్యతిరేకత సాకుతో…తమని తప్పించడం కరెక్ట్ కాదనే భావనతో కొందరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రభుత్వంపై కూడా వ్యతిరేకత ఉన్నప్పుడు తమనే టార్గెట్ చేయడం సారి కాదని అంటున్నారు. మొత్తానికైతే కొందరు సిట్టింగులని కే‌సి‌ఆర్ మార్చడం ఖాయంగా కనిపిస్తుంది.