వారి చేతిలో దారుణంగా మోసపోయిన సింగర్ సునీత భర్త..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో సింగర్ సునీత మంచి పాపులారిటీ సంపాదించింది.. సునీత సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా మరింత పాపులారిటీ సంపాదించింది.. గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేని వివాహం చేసుకుంది. ఈయన సంస్థకు కూడా ఊహించని స్థాయిలో పాపులారిటీ పెరుగుతోంది.అయితే ఈ సంస్థకు ఒక వ్యక్తి టోకరా వేసి దాదాపుగా రెండు కోట్ల రూపాయల వరకు కాజేశారని వార్తలు వినిపిస్తున్నాయి..

Sunitha Upadrasta gets engaged to Rama Krishna Veerapaneni | The Indian  Express

ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సంస్థలో చాలా నమ్మకంగా పనిచేస్తున్న ఒక వ్యక్తి క్యాష్ లావాదేవీలకు సంబంధించిన డబ్బును సంబంధించిన డబ్బులను అతను తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఆ వ్యక్తిపై మ్యాంగో మీడియా అధినేత సంస్థలు ఏ విధంగా చర్యలు తీసుకుంటారో తెలియాల్సి ఉంది. అయితే మోసం చేసిన వ్యక్తి పలు సంస్థలలో కూడా ఉద్యోగాల కొరకు పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. దీంతో ఇక మీదట ఇలాంటి చిన్న చిన్న పొరపాటు జరగకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు మ్యాంగో సంస్థ అధినేత రామ్ వీరపనేని

అయితే ఈ విషయంపై ఇంకా పోలీస్ కేసు నమోదు కాలేదు.. అయితే ఇలా ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు సైతం మేనేజర్ల మాటలు నమ్మి కెరీర్ను రిస్క్ లో పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి.. ఇక మ్యాంగో మీడియా అధినేత కూడా ప్రస్తుతం బిజీగా ఉండడం వల్లే ఈ తరహాలో పొరపాటు జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక సింగర్ సునీత కూడా సినిమాలలో కూడా భారీగానే సంపాదిస్తున్నట్లుగా తెలుస్తోంది.