బ్లాక్ బస్టర్ మూవీని మిస్ చేసుకున్న సందీప్ కిషన్..!!

ప్రతివారం ఏవో ఒక చిన్న సినిమాలు బడా సినిమాలు విడుదలవుతూ ప్రేక్షకులను మెప్పించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి. అలాంటి వాటిలో కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ విజయాలను కూడా అందుకోగా మరికొన్ని ఫ్లాపులుగా మిగిలి ఉంటాయి.. చాలా సినిమాలు ముందు ఒక హీరో దగ్గరకు వెళ్లి ఆ తర్వాత ఆ హీరో రిజెక్ట్ చేయడంతో మరో హీరో వద్దకు వెళ్లి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సందర్భాలు ఉన్నాయి.. అలా ఇప్పటివరకు ఎంతో మంది హీరోలు మంచి విజయాలను అందుకున్నారు.

Sundeep Kishan loses 11 kg weight for his next!

తాజాగా యంగ్ హీరో సందీప్ కిషన్ ఒక బ్లాక్ బాస్టర్ విజయాన్ని మిస్ చేసుకున్నారు. సందీప్ తన ప్రతి సినిమాకి వైవిధ్యమైన నటన ప్రదర్శిస్తూ ఉంటారు. కామెడీ దగ్గర నుంచి యాక్షన్స్ సన్నివేశాల వరకు అన్ని జోనర్ లోను కూడా మెప్పించగలడు.. ఈమధ్య విడుదల అయి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న సామాజవరగమన సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో హీరోగా శ్రీ విష్ణు నటించిన మొదటిసారి రూ.50 కోట్ల రూపాయలను సంపాదించిన చిత్రంగా పేరు సంపాదించింది.

Samajavaragamana OTT Release Date: OTT Platform, Satellite Rights, and  Watch Online – FilmiBeat

అయితే ఈ సినిమా మొదట సందీప్ కిషన్ వద్దకు వెళ్లిందట. ఆయన కూడా కథ బాగా నచ్చిందని వెంటనే నిర్మాత రాజేష్ దండాలు కూడా సందీప్ సజెనెస్ట్ చేశారట. అయితే కొద్ది రోజుల్లో మూవీ చేయాలనుకుంటున్న సమయంలో అతను అంతకన్నా ముందు అంగీకరించిన ప్రాజెక్టుల కారణంగా ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం.. సందీప్ కిషన్ మైకేల్ సినిమా షూటింగ్ సమయంలో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమాకి డేట్ లను అడ్జస్ట్ చేయలేకపోయారట దీంతో బ్లాక్ బస్టర్ సినిమాలు కట్టించలేకపోయాడు.. భారీ అంచనాల మధ్య మైఖేల్ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలవ్వగా ఫ్లాప్ గా నిలిచింది.