`బేబీ` ఈవెంట్ లో బ‌న్నీ వేసుకున్న ఆ వైట్ షూస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిరిగిపోద్ది!

బేబీ.. రీసెంట్ గా విడుద‌లైన ఈ ల‌వ్ అండ్ రొమాంటిక్ డ్రామా బాక్సాఫీస్ వ‌ద్ద డ‌బుల్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. చిన్న సినిమాగా వ‌చ్చిన బేబీ పెద్ద విజ‌యం సాధించింది. విడుద‌లై ప‌ది రోజులు కావొస్తున్నా ఇంకా ఈ సినిమా థియేట‌ర్స్ లో సూప‌ర్ స్ట‌డీగా దూసుకుపోతోంది. అయితే బేబీ మూవీ ఘ‌న విజ‌యం సాధించిన సంద‌ర్భంగా.. చిత్ర టీమ్ మొత్తాన్ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభినందించేందుకు ప్ర‌త్యేకంగా ఓ ఈవెంట్ ను ఏర్పాటు చేశాడు.

గురువారం హైద‌రాబాద్ లో ఈ ఈవెంట్ జ‌రిగింది. బేబీ టీమ్ మొత్తం ఈ ఈవెంట్ లో పాల్గొంది. ఈ సంద‌ర్భంగా అల్లు అర్జున్ హీరోహీరోయిన్లు, ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌తో పాటు బేబీ మూవీ కోసం ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రిపై ప్ర‌శంస‌లు కురిపించాడు. ఈ ఈవెంట్ లో బ‌న్నీ లుక్ ఆక‌ట్టుకుంది. వైట్ ష‌ర్ట్‌, బ్లాక్ ప్యాంట్ ధ‌రించి క్లాసీ లుక్ లో బ‌న్నీ స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ గా నిలిచాడు.

అయితే బేబీ ఈవెంట్ లో బ‌న్నీ వేసుకున్న వైట్ షూస్ ధ‌ర ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గివెన్‌చీ రూపొందించిన ట్రెండీ క్రోకోడైల్-ఎఫెక్ట్ వెబ్బింగ్ వైట్ లో-టాప్ స్నీకర్స్ ను బ‌న్నీ వేసుకున్నాడు. వీటి ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిరిపోద్ది. ఎందుకంటే, వాటి ఖ‌రీదు అక్ష‌రాల రూ. 50 వేలు. ఈ విష‌యం తెలిసి నెటిజ‌న్లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. కాగా, బ‌న్నీ ప్ర‌స్తుతం పుష్ప 2 మూవీతో బిజీగా ఉన్నాడు. అలాగే త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ తో ఓ సినిమా, సందీప్ రెడ్డి వంగాతో ఓ సినిమా చేసేందుకు బ‌న్నీ క‌మిట్ అయ్యాడు.